Vasthu tips : మనం చేసే చిన్న చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను పెట్టరాని చోట్ల పెట్టడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వేటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుని మరి వాటిని అక్కడే ఉంచడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు పీకల్లోతు అపపులో కూరుకుపోయేలా చేసే ఆ మూడు తప్పులు ఏంటి, వాటికి పరిష్కార మార్గం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఇంట్లో ఉండే డస్ట్ బిన్ ను ఎప్పుడూ ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు. దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం వల్ల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చాలా మంది బెడ్ పైనే భోజనం చేస్తుంటారు. వాస్తు శాస్త్రంలో ఇది తీవ్ర తప్పింద. ఇది ఒక వ్యక్తిని పూర్తిగా పేదవాడిగా మారుస్తుంది. వారి శ్రేయస్సుకు ఆటంకం కల్గిస్తుంది. అంతే కాకుండా రాత్రి సమయంలో తిన్న పాత్రలను వంట గదిలో అలాగే అస్సలే వదిలేయకూడదు. వాటిని క్లీన్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల కూడా లక్ష్మీ దేవి మన ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. అలాగే రాత్రిపూట ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే… అనేక ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవే కాకుండా సాయంకాల సమయంలో బయటి వ్యక్తులకు పాలు, పెరుగు, ఉప్పు అస్సలే ఇవ్వకూడదు. వీటి వల్ల కూడా ఆర్థిక సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉంది.
Read Also :Vastu Tips: తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!