Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Petrol Prices Today : ఆరు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

దేశంలో ఇంధన ధరలు ఆరు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. అయితే గురువారం నుంచి ఈరోజు వరకు విరామం ఇచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముంబయిలో ... Read more

By Vinod Kumar

Published on: April 12, 2022 6:29 PM

Updated on: April 12, 2022 6:29 PM

---Advertisement---

దేశంలో ఇంధన ధరలు ఆరు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. అయితే గురువారం నుంచి ఈరోజు వరకు విరామం ఇచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.