RRR Sequel : ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయుతే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎంతో కీలకమైన హిందీ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే అల్లూరి సీతారామ రాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కుమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా కథను.. డైరెక్టర్ జక్కన్న తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ రాశాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ వివరించారు. ఎన్టీఆర్ వాళ్లింటికి వచ్చిన రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు కొనసాగింపు చిత్రం గురించి అడిగారట. అయితే విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఐడియాలు చెప్పడంతో… డైరెక్టర్ రాజమౌళితో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు చాలా బాగా నచ్చాయట. అయితే దైవాను గ్రహం ఉంటే కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!