Alia Bhatt : ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌పై ఒదిగిపోయింది. అయితే తనపై కొన్నిరోజులుగా వస్తున్న వార్తలపై అలియా స్పందించింది. ఆర్ఆర్ఆర్ టీంపై తాను ఆగ్రహంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఆమె ఖండించింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా ఈ అసత్య ప్రచారాన్ని క్రియేట్ చేయొద్దని కోరింది. తన అకౌంట్లో పోస్టులు తక్కువగా ఉండాలని ఉద్దేశంతోనే పోస్టులు డిలీట్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది.
నా అకౌంట్లో పాత వీడియోలను డిలీట్ చేస్తున్నాను. అదే నేను చేసింది.. మీ మాత్రానికే నాపై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని అమ్మడు ఫైర్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీలో నాకు అవకాశం దక్కడం నిజంగా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను..

సీత పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక రాజమౌళి సార్, చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి పనిచేయడం నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఎన్నో సంవత్సరాలుగా రాజమౌళి టీమ్ పడిన కష్టానికి ప్రతిఫలమే ఆర్ఆర్ఆర్.. ఈ మూవీకి సంబంధించి నాపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ అలియా చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా ఎంట్రీ ఇచ్చింది. పాన్ ఇండియా మూవీ కావడంతో అలియ పాత్ర ఉండేది 15 నిమిషాలే అయినప్పటికీ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ఈ మూవీలో తన సన్నివేశాలు చాలా తక్కువగా చూపించారని తాను ఆర్ఆర్ఆర్ టీంపై ఆగ్రహంతో ఆర్ఆర్ఆర్ పోస్టులన్నింటిని తన ఇన్ స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసిందని, రాజమౌళిని అన్ ఫాలో అయినట్టుగా బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

Read Also : RRR Movie: రాజమౌళికి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు… కారణం అదేనా?
Read Also : Alia Bhatt RRR : ఆలియా భట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కనిపించేది ఎంత సమయమో తెలుసా?