...

WhatsApp: ఆ కస్టమర్లకు షాకింగ్ న్యూస్… ఇకపై ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు?

WhatsApp: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉన్నటువంటి యాప్ ఏదైనా ఉందా అంటే అది వాట్సాప్ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ యాప్ ద్వారా ఎంతోమంది వారి పరిచయాలు పెంచుకోవడమే కాకుండా వారికి సంబంధించిన విషయాలను కూడా ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ విధంగా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ యాప్ నేటి నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేయదు.ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు సంబంధిత కంపెనీ అధికారికంగా వెల్లడించారు.

నేటి నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నట్టు కంపెనీ వెల్లడించారు.ఆండ్రాయిడ్‌ 4.0, అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.
కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువ వెర్షన్ ఉన్నవాటిలో ఈ యాప్ పని చేయదు. మరి ఈ యాప్ ఏ ఫోన్ లలో పనిచేయదు అనే విషయానికి వస్తే…

సామ్ సంగ్: గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, గెలాక్సీ కోర్‌ వంటి మోడల్స్‌లో మార్చి 31 తర్వాత వాట్సాప్‌ పని చేయదు.

ఎల్ జీ: ఎఫ్‌3, ఎఫ్5, ఎఫ్‌6, ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎల్‌3 II డ్యూయల్‌, ఎల్‌4 II డ్యూయల్, ఆప్టిమస్‌ ఎల్ II, ఎఫ్‌5 II, ఎఫ్‌5 II డ్యూయల్‌, ఎఫ్‌7 II, ఎఫ్‌7 II డ్యూయల్‌, ఎల్‌జీ ఎన్‌ఆక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

షావోమి: హంగ్ఎంఐ, ఎంఐ2ఏ, రెడ్‌మీ నోట్‌ 4జీ, హంగ్ఎంజీ 1ఎస్‌ వంటి మోడళ్లలో ఈ యాప్ పని చెయ్యదు. వీటితోపాటు మోటోరోలా,హువావే వంటి స్మార్ట్ ఫోన్లలో కూడా నేటితో వాట్సాప్ సేవలు ముగియనున్నాయి.