RRR Movie: రాజమౌళికి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు… కారణం అదేనా?

RRR Movie: టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా విడుదల అయ్యి ఆరు రోజులు అవుతున్నా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా మీడియా ఇంకా తగ్గడంలేదు. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తు తీసుకుపోతుంది. ఈ సినిమా కోసం జక్కన్న టీమ్ రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి అనుకున్న విధంగా ఫైనల్ అవుట్ పుట్ తీసుకురావడం కోసం ఇద్దరు హీరోలను చాలా కష్ట పెట్టారట.

అయితే వారి రెండున్నర ఏళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా విడుదలై ఐదు రోజుల్లోనే దాదాపుగా 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ను రాబట్టింది. ఇక హిందీలో అయితే ఈ సినిమా ఏకంగా 100 కోట్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్పటికీ ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. అందుకు గల కారణం ఈ సినిమాలో ఎన్టీఆర్ ని కంటే రామ్ చరణ్ ని ఎక్కువగా వాడుకున్నారని, సినిమాలో ఎక్కువగా రామ్ చరణ్ కు ప్రాధాన్యత ఇచ్చారు అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ.. ఎన్టీఆర్ ఫ్యాన్ గా నిజం చెబుతున్నా ఈ సినిమా అసలు బాగోలేదు.

సినిమాలో ఎన్టీఆర్ కి 10% మాత్రమే స్కోప్ ఇచ్చారు. అనవసరంగా ఎన్టీఆర్ కు రెండున్నర సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. ఎన్టీఆర్ కి బదులుగా వేరే ఇంకెవరైనా హీరోని చూసుకోవాల్సింది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సెకండాఫ్ లో మాత్రం చాలా వరకు రామ్ చరణ్ డామినేషన్ కనిపిస్తోందని, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటించినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను స్క్రీన్ స్పేస్ తగ్గడం పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సహనం కోల్పోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళికి ఫోన్ చేసి మరీ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట. అంతే కాకుండా బెదిరింపులకు కూడా బాధపడుతున్నారట. అయితే ఈ విషయంపై అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel