Intinti Gruhalakshmi March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్, శృతి లు రోడ్డుపై నడుచుకుంటూ మాట్లాడుతూ వెళుతూ ఉంటారు. రొమాంటిక్ గా నవ్వుతూ రోడ్డు ఫై నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఇక ఇంతలో తులసి బైక్ నడుపుతూ ప్రేమ్,శృతి ని చూసి ఆనంద పడుతుంది. కానీ జరిగిన విషయాన్ని తలచుకొని పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి అంటుంది. అప్పుడు ప్రేమ్ మీ జీవితాలు నుంచి వెళ్ళిపోయాను కదమ్మా ఇంకా డిస్టర్బ్ చేస్తున్నానా అని అనగా, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు పక్కకు తప్పుకో అని తులసి అనగా ప్రేమ్ ఎమోషనల్ అవుతాడు. శిక్ష విధించారు కదమ్మా, అనుభవిస్తున్నాము అయినా కూడా మా మీద నీకు కోపం తగ్గలేదా అని అంటాడు.

అప్పుడు తులసి లోపల అంత బాధ దాచుకుని పైకి కోపంగా మాట్లాడుతున్నారు ఆంటీ అని అంటుంది.ప్రేమ్ మాటలకు తులసి ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ్ ఇంటి ఓనర్ ల మధ్య ఫన్నీ యుద్ధం జరుగుతుంది. కొత్తగా ఇంట్లోకి అద్దెకు దిగిన వాడితో డబ్బులు ఇప్పించుకోమని చెప్పాను కదా వెళ్ళి తీసుకొని రా అని అంటుంది. అప్పుడు అతను వెళ్లి ప్రేమ్, శృతి లఫై డబ్బులు ఇవ్వలేదు అని విరుచుకు పడతాడు. డబ్బులు ఇస్తారా లేదంటే ఇల్లు ఖాళీ చేస్తారా అని బెదిరిస్తాడు. ఇంతలో ఓ రాములమ్మ వచ్చి ఇదిగో బాబు మీ అడ్వాన్స్ 3000 అని ఇస్తుంది. మరొకవైపు అనసూయ భర్త ఇంట్లో పార్టీ ఉంది అని తెలిసి ఎంగ్ గా రెడీ అవుతాడు.
అలాగే దివ్య కూడా తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనసూయ తన భర్తను ఆ విధంగా చూసి చిర్రుబుర్రు లాడుతుంది. దివ్య తన ఫ్రెండ్స్, తాతయ్య తో కలిసి ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది. మరొకవైపు తులసి జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ భర్త దివ్య ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. అది చూసిన అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
మధ్యలో లాస్య కూడా వచ్చి రచ్చ రచ్చ ఉంటుంది. మా ఇంటికి వచ్చిన తులసి టేబుల్ పై జంక్ఫుడ్స్ ని చూసి ఏంటి దివ్య ఇది ఎందుకు డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నావు అని అడగగా.. ఇది మా డాడ్ డబ్బులు నీ డబ్బులు కాదు అర్థం అయిందా అని దివ్య అనగా.. అప్పుడు తులసి దివ్య చెంప పగలగొడుతుంది. మరొకవైపు ప్రేమ్ ఇంటి ఓనర్ ప్రేమ్ ఫై విరుచుకుపడుతూ ఉంటుంది.
Read Also : Intinti Gruhalakshmi: దివ్య చెంప పగలగొట్టిన తులసి.. నందు ఏం చేయనున్నాడు..?