Intinti Gruhalakshmi March 15th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. దివ్య భోజనం చేస్తూ ఉండగా అప్పుడు రాములమ్మ తులసి గురించి గొప్పగా చెబుతుంది. అప్పుడు దివ్య రాములమ్మ ఫై కోప్పడుతుంది. ఇంతలో లాస్య, నందు అక్కడికి వస్తారు. దివ్య భోజనం చేస్తూ ఉండటం చూసి నందు సంతోష పడతారు. వెరీగుడ్ దివ్య అని అనగా.. ఈ క్రెడిట్ అంతా లాస్య ఆంటి దే డాడ్ అని చెబుతుంది.
అప్పుడు తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దివ్య వాళ్ల నాన్న ని పొగుడుతూ నా చిన్ని తన మాటలతో బాధ పెడుతూ ఉంటుంది. లాస్య బాగా చెప్పావు దివ్య అంటూ మరింత రెచ్చ గొడుతుంది. అప్పుడు లాస్య మరింత ఓవర్ చేస్తూ అన్నం తింటున్న దివ్య తో కలిసి సెల్ఫీ కూడా జరుగుతుంది. అది చూసిన తులసి లోపల బాధ పడుతూ ఉంటుంది.
ఆ తరువాత దివ్య నందుని హగ్ చేసుకొని ఐ లవ్ యు లాస్య ఆంటీ అని అంటుంది. ఆ తర్వాత మాధవి తులసి కి ఫోన్ చేసి ప్రేమ్ గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు తులసి మాధవి నువ్వు వెళ్లి ఉంటే పర్లేదు కానీ ఆ విషయం చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది తులసి. తులసి ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన దివ్య మనుషుల నీ వద్దని తరిమేసాక ఎందుకు ఈ దొంగ కన్నీళ్లు అనే అంటుంది.

తులసి ఎంత చెప్పినా కూడా దివ్య వినకుండా తులసి విషయంలో నెగిటివ్ గా ఆలోచిస్తూ తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. దివ్య మాటలకు తులసి మరింత బాధ పడుతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ శృతి లు ఆరుబయట పడుకొని రొమాంటిక్ గా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ తన తల్లి తులసిని తలుచుకుంటాడు.
మరొకవైపు తులసి, నందులు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచింది నువ్వు ఇంటి దగ్గరే ఉండి వారికి కావాల్సినవి చూసుకో తులసి అని అనగా.. అప్పుడు తులసి నేనెందుకు లాస్య ఉందికదా అని అంటుంది. లాస్య కు వంట రాదు అన్న విషయం నీకు తెలుసు కదా అని అంటాడు నందు.
అప్పుడు తులసి అవన్నీ నాకు తెలియదు దివ్య అడిగితే తప్పకుండా ఇంటి దగ్గరే ఉంటాను అంటూ కోపంతో తులసి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ్ ఇంటి ఓనర్ అతనిపై మనుషుల్ని పిలుచుకుని వచ్చి విరుచుకుపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Read Also : Intinti Gruhalakshmi: తులసిని అవమానించిన దివ్య.. తల్లిని తలచుకొని బాధపడుతున్న ప్రేమ్..?
- Intinti Gruhalakshmi july 25 Today Episode : తులసి ప్రపోజల్ కి ఓకే చెప్పిన సామ్రాట్.. ఆనందంలో తులసి కుటుంబం..?
- Intinti Gruhalakshmi: నందుకీ తగిన విధంగా బుద్ధి చెప్పిన అనసూయ.. కింద పడిన తులసి..?
- Intinti Gruhalakshmi September 8 Today Episode : తులసి మీద కోపాన్ని హనీ మీద చూపించిన సామ్రాట్.. ఆనందంలో నందు, లాస్య..?
















