Vasthu Tips : మీ ఇంట్లో అంతా గందరగోళంగా ఉందా..? నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలా చేయండి..!

Top 9 Powerful Mantras to Remove Negative Energy
Top 9 Powerful Mantras to Remove Negative Energy

Vasthu Tips : కొందరు బయటకు వెళ్లి ఇంటికి రాగానే చిరాకు పడుతుంటారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారిలో ఏదో తెలియని మార్పును మనం గుర్తించవచ్చు. బయట ఉన్న వ్యక్తి నవ్వుకుంటూ వచ్చి.. ఇంట్లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే పిచ్చిగా ప్రవర్తించడం, ఇంట్లోని వారిపై చిరాకు పడటం, విసిగించుకోవడం, ఏదో కోల్పోయినట్టు బిహేవ్ చేస్తే అందుకు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కారణమై ఉండొచ్చు.

దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు లైటింగ్‌లో ఉండాలని, ఫ్రీ స్పేస్, పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండాలని, పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం బయటకు వస్తువులు దొరుకుతాయి. వాటిని ఇంట్లో డెకరేట్ చేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి చిరాకు దూరం అవుతాయని చెప్పారు.

Advertisement
Top 9 Powerful Mantras to Remove Negative Energy
Top 9 Powerful Mantras to Remove Negative Energy

కొందరు తమ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. వస్తువులను కూడా స్పేస్‌కు అనుగుణంగా అడ్జస్ట్ చేస్తారు. ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. ఇలా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇళ్లంతా వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లోని వ్యక్తులు కూడా ఆరోగ్యంగా, కూల్‌గా ఉంటారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిచేరవు. మనం ఉంటున్న ఇంటికి శుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్య సమస్యలు, చిరాకు, కోపాలు, గొడవలు అవుతాయి. దీనంతటికీ నెగెటివ్ ఎనర్జీనే కారణమంటున్నారు కొందరు.

Vasthu Tips : నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలంటే? 

ఇలాంటి నెగెటివ్ వైబ్రేషన్స్ నుంచి దూరంగా ఉండాలంటే మన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ ఇంట్లో కొన్ని డెకరేషన్ పీసెస్‌ను కొనుగోలు చేయాలి. కలర్ ఫుల్ ల్యాంప్ సెంటర్, టేబుల్స్, విండో, డోర్ కర్టన్స్ కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి.మంచి లైటింగ్ పడేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇల్లు ఇరుకుగా ఉండకుండా చూసుకోవాలి. సోఫా ఉన్న వారు అందులోకి మంచి తలగడలు, కుషన్స్ తీసుకోవాలి.క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్‌ కొనండి.

Advertisement

వెల్వెట్ అయితే మంచి లుక్ ను ఇస్తాయి. ఇక లైటింగ్ విషయానికొస్తే అవి మీ ఇంటికి కొత్త కలను తీసుకొస్తాయి. డిమ్ లైట్స్ అసలే వాడొద్దు. సీలింగ్ లైట్లు, ఫ్లోర్ లైట్లు, టేబుల్ లైట్లు కలర్ ఫుల్ ఉండేలా చూసుకొండి. ఇంట్లోని నేలపై వాడే కార్పెట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కిచెన్ సామగ్రి కూడా మంచి క్వాలిటీవి తీసుకోవాలి. కలర్ ఫుల్ వాల్ పెయింట్స్, డ్రీమ్ క్యాచర్స్, క్వాలిటీ సౌండ్ సిస్టమ్స్, డైజైనింగ్ సీలింగ్, అట్రాక్టింగ్ డోర్ అండ్ విండోస్ ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో పాజిటివై ఎనర్జీ పాస్ అవుతుంది.

Read Also : Vasthu tips: మీ ఇంట్లో అరటి చెట్టు ఉందా.. అయితే ఈ దిశలో అస్సలే పెంచకూడదు!

Advertisement