Bigg Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఐదో సీజన్ లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా 17మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది. మొదటి రెండు వారాలలో మొదటివారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.ఇలా ఇద్దరు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడంతో 15 మంది హౌస్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలు జరిగాయి.
ఇక ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం కెప్టెన్ గా అనిల్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 15 మంది కంటెస్టెంట్ లో 12 మంది నామినేషన్ లో ఉన్నారు. అనిల్ కెప్టెన్ గా వ్యవహరించడం వల్ల అతనిని నామినేట్ చేసే అవకాశం లేదు. ఇక సరయు, అషు రెడ్డి, అనిల్ మినహా మిగిలిన 12మంది నామినేషన్ లో ఉన్నారు.
ఇక ఈ విధంగా 15 మంది కంటెస్టెంట్ లలో 12 మంది నామినేషన్ లో ఉండటం ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పవచ్చు.అయితే 12 మంది కంటెస్టెంట్ లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటివరకు వారియర్స్ ఒకరు ఛాలెంజర్స్ ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.ఇక ఈ విషయంపై నటుడు కౌశల్ స్పందిస్తూ బిందుమాధవి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Read Also : Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్… విన్నర్ ఎవరంటే?