Horoscope : ఈ వారం అంటే మే 15వ తేదీ నుంచి 21 వరకు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే వారి రాశి ఫలాలు, గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి… ఈ లక్కీ రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వృషభ రాశి.. మనోబలం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. దృఢచిత్తంతో, ధర్మమార్గంలో చేసే పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త. సూర్య ధ్యానం శుభప్రదం.
కర్కాటకం.. శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగపరంగా అభివృద్ధీ ప్రశంసలూ ఉంటాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. లక్ష్మీధ్యానం మంచిది.
ధనస్సు.. అత్యంత శ్రేష్ఠమైన కాలం. తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. ఘనకీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు జీవితం లభిస్తుంది. వ్యాపారబలం ఉంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
Read Also : Nagadosham : నాగదోషం ఉంటే ఈ సంకేతాలు నిజంగానే కనిపిస్తాయా.. నిజమెంత?