Viral News: సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఒక ముఖ్యమైన కలగా ఉంటుంది. తమ పిల్లలు సరైన వయసులో వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకాబోయే వారు మాత్రం తన కన్న కొడుక్కి వివాహం చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రవర్తనతో విసుగు చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు శామ్లీకి చెందిన అజీమ్ మన్సూరీ కి 26 సంవత్సరాల వయసు. ప్రతి యువకుడు ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అందరిలాగే అజీమ్ మన్సూరీ కూడ పెళ్లి చేసుకోవాలా ఆశ పడ్డారు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన లోపాల కారణంగా అతనికి ఎక్కడ సంబంధం కుదరలేదు. ఎందుకంటే అజీమ్ కేవలం 3 అడుగుల 2 అంగుళాల పొడవు కలిగి ఉన్న మరగుజ్జు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉండటం వలన పెళ్లి కుదరటం లేదని ఇదివరకు ఒకసారి అజీమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇటీవల అజీమ్ తన తల్లదండ్రులు నన్ను పెల్లి చేసుకోవటానికి పిల్ల దొరికిన కూడ పెళ్లి చేయటం లేదని తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేశాడు. గాజియాబాద్‌కు చెందిన రెహానా అనే యువతి కూడ మరగుజ్జు. ఈ లోపం కారణంగా ఆమెకు కూడ పెళ్లి జరగటం లేదు. అయితే ఏడాది క్రితం వీరిద్దరి పెళ్ళి చేయటానికి పెద్దలు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకూ వారికి పెళ్లి చేయకుండ అజీమ్ అడిగితే తన తమ్ముళ్ళతో కలసి వివాహం జరిపిస్తామని చెప్తూ వచ్చారు. దీనితో అజీమ్ విసుగు చెంది పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World