Sudigali Sudheer : ఈటీవీలో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ డౌన్ టైమ్ స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. హైపర్ ఆది జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. త్వరలోనే మరో ప్రముఖ టీమ్ లీడర్ కూడా ఈ టీవీ మల్లెమాలకు గుడ్బై చెప్పే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మల్లెమాల వారితో ఆయన చేసుకున్న అగ్రిమెంట్ త్వరలోనే ముగియ బోతోందట. తద్వారా ఆయన ఈటీవీ నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయట.
ఈ సమయంలో సుడిగాలి సుదీర్ మరియు గెటప్ శీను మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ టాక్ వినిపిస్తుంది. ఒకానొక సమయంలో గెటప్ శీను జబర్దస్త్ వేదికపై మాట్లాడుతూ ఎన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా, ఎన్ని కార్యక్రమాల్లో అవకాశం వచ్చినా కచ్చితంగా జబర్దస్త్ లో ఎప్పుడు చేస్తాను అంటూ గెటప్ శీను హామీ ఇచ్చాడు. ఆ మాటను ఇప్పుడు గెటప్ శీను నిలుపుకోలేక పోతున్నాను అంటూ సుధీర్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడట.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ఎపిసోడ్ కోసం ప్రాక్టీస్ చేయడానికి రమ్మని ఆహ్వానించినా కూడా గెటప్ శీను హాజరు కావడం లేదని సుడిగాలి సుధీర్ మల్లెమాల వారికి ఫిర్యాదు చేశాడట. ఎక్కువ శాతం సినిమా షూటింగ్ లకు శీను సమయం కేటాయిస్తూ ఏదో ఒక సమయంలో గంట లేదా రెండు గంటలకు వచ్చి జబర్దస్త్ షో లో చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ టీమ్ మెంబర్స్ ఆ విషయమై స్పందిస్తూ అవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
అతడు సినిమాల్లో నటిస్తున్న విషయం నిజమే కానీ, పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమాన్ని అతను వదిలి పెట్టలేదు అంటూ మల్లెమాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు సుడిగాలి సుధీర్ మరియు గెటప్ శ్రీను మధ్య గొడవలు ప్రచారం మాత్రమే అంటూ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రచారం ఎంత మాత్రం నిజం కాదని వారిద్దరూ ఆప్త మిత్రులు ఎప్పుడైనా కూడా వారిద్దరి మధ్య చిన్న గొడవ వస్తే అది గాలి బుడగల మాదిరిగా క్షణాల్లోనే మాయమైపోతుంది అని వారి సన్నిహితులు స్నేహితులు చెబుతున్నారు.
Read Also : Bigg Boss Non Stop : బిగ్ బాస్‌లో మిత్ర కంటిన్యూ… జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారుగా..?!