Vanitha Vijay Kumar: జబర్దస్త్‌లోకి ఎంటర్ అయిన కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్.. షోలో రచ్చ రచ్చే!

Vanitha Vijay Kumar: గత తొమ్మిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ టీఆర్పీ రేటుతో దూసుకుపోతూ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న కామెడీ షో జబర్దస్త్. ఈ కార్యక్రమం ద్వారా పలువురు కమెడియన్లకు సైతం పాపులారిటీతో పాటు, జీవితాన్నీ ప్రసాదించింది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రారంభంలో నాగబాబు, రోజా ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, కొన్ని కారణాల వల్ల నాగబాబు వైదొలగి, రోజా ఒక్కరే షోలో కంటిన్యూ అవుతున్నారు. కానీ తాజాగా ఆమె కూడా మంత్రి పదవి రాబోయే సూచనల దృష్ట్యా షోకి గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయంటూ ప్రచారం సాగుతోంది.

ముందు నుంచి ఇప్పటికి చూసుకుంటే ఈ షోలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది కమెడియన్లు షో నుంచి వెళ్లిపోయి, వేరే ఛానెళ్లలో ఇతర ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంతో పాటు జబర్దస్త్‌లోకి మరికొంత మంది నూతన కమెడియన్లు వచ్చి తన ప్రతిభతో గుర్తింపు పొందుతున్నారు. చంటి, సుధీర్, ఆది లాంటి కొంత మంది మాత్రం ఇప్పటికీ షోలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కొంత మంది నూతన కమెడియన్ల రాకతో జబర్దస్త్‌ నూతన కళను సొంతం చేసుకుంటోంది.

అందులో భాగంగా తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో ఈ సారి జబర్దస్త్‌ షోకి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన వనితా విజయ్ కుమార్ వచ్చినట్టు తెలుస్తోంది. తన కామెడీతో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు ఈ ప్రోమోను చూస్తే అవగతం అవుతోంది. ఇక ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుని, ఆ తర్వాత పలు వివాదాల్లో కీలకంగా మారిన ఈమె ఈ షోకి రావడంతో ప్రేక్షకులంతా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈమె ఈ షోకి రావడంతో షోలో ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel