Devatha March 23th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు స్టార్ మాలో ప్రసారం అవుతూ మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుందనే విషయానికి వస్తే….ఆదిత్య తన కూతురు దేవి తన ఇంటికి వస్తుందని ఎంతో సంతోషంగా తనకు ఎంతో ఇష్టమైన వస్తువులు బొమ్మలు పుస్తకాలు అన్నీ తెచ్చి ఇంట్లో పెడతారు. ఇవన్నీ ఎందుకు అంటే రాబోయే వారసురాలు కోసం అని సమాధానం చెబుతాడు. అసలు పుట్టబోయే పిల్లలకు తెచ్చే బొమ్మలా ఇవి అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.
ఇక ఆదిత్య ప్రవర్తించడంతో ఇంటిలోని వారందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇక సత్య తను గర్భవతి కాకుండా ఆదిత్య ఇలా బొమ్మలు తీసుకురావడంతో తన ప్రవర్తన అర్థం కాక ఇబ్బంది పడుతుంది.ఈ క్రమంలోనే ఈ విషయం రాధకు చెప్పడానికి రాదా ఇంటికి వెళ్లిన సత్య అక్కడే చిన్మయి దేవిలను చూసి కేవలం చిన్మయి ని మాత్రమే పలకరించి లోపలికి వెళ్తుంది. తనని పలకరించకపోవడంతో దేవి బాధపడుతుంది. ఇక సత్య రాద దగ్గరకు వెళ్లి ఆదిత్య ప్రవర్తన గురించి చెప్పి ఆందోళన పడుతుంది.
రాధా సత్య మాటలు విని మీ ఆయన ముందు చూపు లేకుండా ఏ పని చేయరు అంతా మంచి జరిగేలా చూస్తారు. నువ్వు మీ అత్త బాధ పడాల్సిన పని లేదు అంటూ ధైర్యం చెబుతుంది. ఇక సత్య వెళ్లిన తర్వాత రాధా ఆదిత్యతో మిమ్మల్ని ఒకసారి కలవాలి అంటూ తనని కలుస్తుంది.ఇక ఆదిత్యను కలిసిన రాధ తన కూతురు దేవిని తనకు దత్తత ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళు ఇష్టపడటం లేదని సమాధానం చెబుతుంది. దేవి పై ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ప్రేమ పెంచుకున్నారు. అలా దేవిని మీకు దత్తత ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోలేదు అని చెబుతుంది.
రుక్మిణి మాటలు విన్న ఆదిత్య ఇప్పటికే నా కూతురు తండ్రి ప్రేమకు ఎంతో దూరం అయింది అయినా నా కూతుర్ని నాకు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు బాధ పడతారు .ఆడపిల్ల ఎప్పుడైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే కదా అంటూ వాదిస్తాడు. నీ బాధను చూడలేక దేవిని నీకు ఇస్తానని చెప్పాను… కానీ ఇవ్వలేకపోతున్నాను అంటూ ఆదిత్య పెట్టుకున్న ఆశలపై రుక్మిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇలా రుక్మిని మాటలు విన్న ఆదిత్య ఎవరో బాధపడతారని నా బిడ్డను నాకు దూరం చేయకు ఎవరి గురించి ఆలోచించకుండా నా బిడ్డను నా దగ్గరకు పంపు నేను తన నాన్న అని తెలిస్తే తన ఎలా ఫీల్ అవుతుంది అనే విషయం గురించి ఆలోచించు అంటూ ఆదిత్య వాదిస్తాడు. మరి వీరిద్దరి వాదనలో ఎవరి వాదన నెగ్గుతుంది? దేవి ఆదిత్య దగ్గరకు వెళ్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
Read Also : Devatha: రాధ కి షాక్ ఇచ్చిన ఆదిత్య.. మాధవ ఏం చేయనున్నాడు..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World