Guppedantha Manasu : రిషి, వసుధార గురించి మరోలా జగతికి చెప్పిన గౌతమ్… వసును నిలదీసిన జగతి!

rishi-gautam-told-jagati-about-vasudhara-jagati-deposed-vasu
rishi-gautam-told-jagati-about-vasudhara-jagati-deposed-vasu

Guppedantha Manasu Feb 12 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతోమందిని ఆకట్టుకొని అత్యధిక రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత హైలెట్ గా మారనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా వసుధార రిషి లైబ్రరీలో ఉండిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని లైబ్రేరియన్ కి ఫోన్ చేసి చెప్పారు అతను వచ్చేలోగా వీరిద్దరూ లైబ్రరీలో ఎంతో సరదాగా అంత్యాక్షరి ఆడుతూ… ఒకరినొకరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు.

Guppedantha Manasu Feb 12 Today Episode
Guppedantha Manasu Feb 12 Today Episode

ఈ సందర్భంగా వసు దేవుడా ఓ మంచి దేవుడా… నువ్వు మంచోడివి లైబ్రరీలో ఇరికించారు… అయినా పర్లేదు రిషి సర్ ఉన్నారు కదా అంటూ వసుధార రిషిని ఇమిటెట్ చేస్తుంది. అనంతరం వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగిన తర్వాత నీకు కాగితాలతో పడవలు చేయడం వచ్చా వసుధార అంటూ అడుగుతారు. అప్పుడు వసుధార కాగితంతో పడవ చేసి చూపిస్తుంది.

Advertisement

మరోవైపు గౌతమ్ వసు బొమ్మ వేసిన చార్ట్ పట్టుకొని వసుధారను ఊహించుకుని పాటలు పాడుతారు.అదే సమయంలో లైబ్రేరియన్ అక్కడికి రావడంతో గౌతమ్ ఇప్పుడే కదా వెళ్లావు… మరి ఎందుకు వచ్చావు అని అడగగా లైబ్రేరియన్ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో గౌతమ్ హడావిడిగా లైబ్రరీ తాళాలు తీసుకుని వెళ్లి తలుపులు తెరుస్తాడు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లగానే వసుధారను చూసి గౌతమ్ షాక్ అవుతాడు. వెనకే రిషి రావడంతో గౌతమ్ షాక్ లో ఉంటాడు.

ఇక ఈ ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా.. రిషి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండడం కోసం గౌతమ్ చేతిని కొడతాడు. దాంతో గౌతమ్ గట్టిగా అరుస్తాడు.ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఈ విషయాన్ని జగతికి ఫోన్ చేసి మరోలా తెలియచేస్తాడు. ఇక ఇంటికి వసుధార రాగానే జగతి అసలు లైబ్రరీలో ఏం జరిగింది అంటూ వసుధారను నిలదీస్తుంది. ఒక్కసారిగా జగతి అలా అడిగేసరికి కంగారు పడగా వెంటనే రిషికి ఫోన్ చేయమని జగతి చెప్పడంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే మరోఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Advertisement

Read Also : Guppedantha Manasu : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే జగతి!

Advertisement