Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rashmika: చేసింది తక్కువ సినిమాలే అయినా.. భారీగా ఆస్తులను పోగుచేసిన రష్మిక.. ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Rashmika: నాగ శౌర్య హీరోగా ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి.తెలుగులో కూడా ఈమె నటించిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ... Read more

By Ramesh Babu

Published on: May 8, 2022 6:30 PM

Updated on: May 8, 2022 5:51 PM

---Advertisement---

Rashmika: నాగ శౌర్య హీరోగా ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి.తెలుగులో కూడా ఈమె నటించిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న రష్మిక భారీ మొత్తంలోనే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న రష్మిక అమాంతం తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారు. ఇలా ఒక్కో సినిమాకు దాదాపు రెండు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రష్మిక ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరింత డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీగా ఆస్తులను కూడబెట్టిన తెలుస్తోంది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక బెంగళూరు తోపాటు ముంబై, హైదరాబాద్ వంటినగరాలలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా ఖరీదైన బంగ్లాలు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలా రష్మిక ఆస్తులన్నీ కలిపి సుమారు యాభై కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రష్మిక ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించడం ఎంతో విశేషం.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మూడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు అలాగే దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక పుష్ప2 సినిమాతో కూడా రష్మిక బిజీ కానున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.