Rashmika: గీతా గోవిందం సినిమాలో రౌడీ బాయ్ తో మేడమ్.. మేడమ్ అని పిలిపించుకున్న రష్మిక మందన్నాను ఆమె ఫ్యాన్స్ కూడా అలానే పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అయితే పుష్ప సినిమాలో శ్రీ వల్లిగా చేసి నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఆమె తన అభిమానులపై చూపించే ప్రేమ కనపడింది. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ చేసిన పనేంటో.. దాని వల్ల ఫ్యాన్స్ పై ఆమెకున్న ప్రేమ ఎలా కనబడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రష్మిక షూట్ ముగించిన తర్వాత.. ఆమె కారవాన్ బయట ఫొటోగ్రాఫర్లు వేచి చూస్తున్నారు. దీంతో ఆమె అక్కడ కాసేపు ఆఘి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంతలో అక్కడే ఉన్న రష్మిక అభిమానులు.. ఫొటో దిగుతామంటూ వ్చచారు. ఒక అబ్బాయి ఆమె పక్కనే నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె బౌన్సర్లు అతడిని పట్టుకుని దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. దీంతో రష్మిక తన బౌన్సర్లను వారించింది. పర్వాలేదు.. పర్వాలేదు రానీ అంటూ అభిమానితో ఫొటో దిగి పంపించింది.
తే కాదండోయ్… తన అభిమానులను హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. అయితే దీన్ని అక్కడున్న వారు వీడియో తీయడం.. ఇది సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూససిన ప్రతీ ఒక్కరూ రష్మికను చాలా మెచ్చుకుంటున్నారు. అభిమానులకు ప్రేమను, గౌరవాన్ని ఇవ్వడంలో నీవ ముందుంటావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram