...

Rashmi Gautam : రష్మి గౌతమ్ కాళ్లు పట్టుకున్న రాకింగ్ రాకేశ్… ఎందుకోసమో చెప్పేసిన మనో..

Rashmi Gautam : బుల్లితెరపై ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’షోలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో వీటికి ఉన్న క్రేజ్ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇకపోతే ఈ షోల్లో ఇటీవల కాలంలో టీం లీడర్స్, ఆర్టిస్టుల కంటే కూడా ఎక్కువగా యాంకర్స్, జడ్జ్‌లు వేసే పంచ్‌లు బాగా పేలుతున్నాయి.

తాజాగా ఈ వారానికి సంబంధించిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఒక్కొక్కరు తెగ రెచ్చపోయారు. ఫైమా, రోహిణి,ఇమాన్యుయేల్, సుధీర్, వర్ష, ఇలా అందరూ తమ తమ పాత్రల్లో చించేశారు. ఇకపోతే ఈ వారం రాకింగ్ రాకేష్ ఏకంగా యాంకర్ రష్మి గౌతమ్‌తోనే ఎంట్రీ డ్యాన్స్ వేశాడు. ఇక అలా రష్మి చిందులు వేస్తే ఎలా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. కాగా, రష్మి గౌతమ్‌తో కలిసి రాకేష్ ఇరగదీసే స్టెప్పులు వేశాడు.

డ్యాన్స్ అయిపోయాక చివరలో రష్మి గౌతమ్ రాకింగ్ రాకేశ్‌ను దీవించినట్లు ఫోజులు ఇచ్చింది. దాంతో వెంటనే ఆ ఫోజులపై సింగర్ మనో సెటైర్ వేసేశాడు. పొద్దున కేరవ్యాన్‌లో యాంకర్ రష్మి గౌతమ్ కాళ్ల మీద పడ్డావ్.. డ్యాన్స్‌ కోసమేనా? అని సింగర్ మనో రాకేశ్ గాలి తీసేశాడు. మనో కామెంట్‌తో రాకేష్ బిత్తరపోయాడు. అయితే, ఆ కామెంట్‌తో యాంకర్ రష్మి గౌతమ్, మనో మాత్రం పగలబడి నవ్వేశారు.

అలా సింగర్ మనో జడ్జిగా ఉండి చేసిన కామెంట్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. ఇకపోతే ఇటీవల కాలంలో ప్రోమోలు కూడా చాలా స్టైలిష్ గా, ఇంట్రెస్టింగ్ గా కట్ చేస్తున్నారని, అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. యాంకర్ రష్మి బుల్లితెరపైన ఎవర్ గ్రీన్ హాట్ యాంకర్ అని ఈ సందర్భంగా ప్రోమో చూసిన నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Balaiah NBK : వామ్మో.. బాలయ్య.. టీనేజీలో అమ్మాయిల కోసం అలా చేశాడా?