Jabardasth Hyper Aadi : హైపర్ ఆదిపై రైజింగ్ రాజు షాకింగ్ కామెంట్స్.. అతను అలాంటి వాడే అంటూ..

Jabardasth Raising Raju Shocking Comments on Hyper Aadi
Jabardasth Raising Raju Shocking Comments on Hyper Aadi

Jabardasth Hyper Aadi : ఓ టీవీ చానళ్లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. పక్క చానళ్ల వాళ్లు పోటీగా ఎన్ని ప్రోగ్రాములు తీసుకొచ్చినా కానీ జబర్దస్త్ ను బీట్ చేయలేకపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు నాట ఈ షో మస్తు పాపులర్ అయింది. ఈ షోతో పరిచయమైన కమెడియన్లు, సినిమాలు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది హీరోలుగా కూడా వెండి తెర మీద వెలిగిపోతున్నారు. ఈ షోలో వచ్చే హైపర్ ఆది గురించి తెలియని వారుండరు. హైపర్ ఆదితో పాటు మరో టీం లీడర్ అయిన రైజింగ్ రాజు కూడా చాలా మందికే పరిచయం. అలా ఈ ఇద్దరు తమ స్కిట్లతో అనేక మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.

కానీ ఆ మధ్యన ఎందుకో రైజింగ్ రాజు జబర్దస్త్ లో కనిపించడం మానేశాడు. బయట కూడా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. దీంతో అందరూ రాజుకు ఏమైందా అని ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. కానీ ఇటీవల రైజింగ్ రాజు ఓ షోలో పాల్గొన్నపుడు అసలు తాను అన్ని రోజుల పాటు ఎందుకు కనిపించకుండా పోయాననే విషయాన్ని గురించి చెప్పాడు. తనకు కరోనా సమయంలో ఇంట్లో మనువరాలు పుట్టిందని తాను బయటకు వెళ్లి వస్తే చిన్న పాపకు ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయపడి తాను ఎక్కడికీ బయటకు రాలేదని చెప్పారు.

Advertisement

కానీ ప్రతినెలా తమ కెప్టెన్ అయిన హైపర్ ఆది తనకు పేమెంట్ పంపించే వాడని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యాడు. హైపర్ ఆదిని ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా తాను మాత్రం నిజాయతీగానే ఉంటాడని అన్నాడు. రైజింగ్ రాజు చెప్పిన మాటలను హైపర్ ఆది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Read Also : Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌లో తన సపోర్టు అతనికే అంటున్న హీరో విశ్వక్ సేన్.. 

Advertisement