...

Actress Indraja : ఆ విషయం వల్లే తన కెరీర్ ఆగిపోయింది అన్న నటి ఇంద్రజ..

Actress Indraja : ఇంద్రజ.. అప్పట్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. తన నవ్వుతో కుర్రకారు మతిని పోగొట్టేసింది. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో పలు కామెడీ షోల్లో జడ్జిగా వ్యహరిస్తోంది. అప్పటి స్టార్ హీరోయిన్లు సౌందర్య, రమ్యకృష్ణ, ఆమని తదితరులతో కలిసి నటించింది. అయితే హీరోయిన్‌గా ఇంద్రజకు స్టార్‌డం మాత్రం రాలేదు.

కమేడియన్ కమ్ హీరో అలీతో మొదలుకొని.. నటరత్న బాలకృష్ణ, కృష్ణ, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ తరువాత వెండితెరకు దూరమైంది. తాజాగా జబర్దస్త్ షోతో బుల్లితెరను అలరిస్తోంది. వచ్చి రాగానే తన నవ్వుతో అందర్నీ కట్టిపడేస్తోంది. షో‌లో స్కిట్ చేసేవారిపై సెటైర్లు వేస్తూ ఆకట్టుకుంటుంది. అతి కొద్ది సమయంలోనే ఇంద్రజ బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో‌కి జడ్జిగా ఆమెను తీసుకున్నారు. అలాగే  వెండితెరపై కూడా రీఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో మెప్పించారు ఇంద్రజ. ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తిర విషయాలు వెల్లడించారు నటి ఇంద్రజ. తాను బ్రహ్మిణ్ అమ్మాయినని.. అయితే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అయితే ఇప్పటికీ బ్రహ్మిణ్ కట్టుబాట్లను ఆచరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మతం, కులం ఆధారంగా చూసి మనుషులను ఇష్టపడటం సరైందికాదని ఇంద్రజ అభిప్రాయపడ్డారు. తను పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదని.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడ్డాకే.. అది కూడా ఆరు ఏళ్లు స్నేహ జీవితం తరువాతే వివాహం చేసుకున్నట్లు నటి ఇంద్రజ చెప్పుకొచ్చారు.

Read Also : Pushpa Sukumar : పుష్పలో ఆ సన్నివేషాన్ని సుకుమార్ నగ్నంగా తీయాలనుకున్నాడట..!