Ramya Raghupathi : నటుడు నరేష్ పెళ్లి వార్తలు రోజు రోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గందరగోళంగా మారిపోతుంది. వీరి పెళ్లి గురించి రోజుకు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సోషల్ మీడియా వేదికగా నరేష్ గురించి ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈమె నటి పవిత్ర లోకేష్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విధంగా రమ్య రఘుపతి విడాకులు కావాలంటూ తనని గన్ తో బెదిరించారు అంటూ చేసిన వ్యాఖ్యలపై నరేష్ స్పందించారు. ఈ విధంగా నరేష్ మాట్లాడుతూ రమ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ramya-raghupathi-came-into-my-life-and-destroyed-my-family-and-blackmailed-for-money
నేను ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నానని రమ్య ఆరోపించారు అయితే తాను వందల సినిమాలలో నటించానని, ఏ ఒక్క అమ్మాయితో నైనా నేను తప్పుగా ప్రవర్తించానో చెప్పమనండి అదే నా వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రమ్య నా జీవితంలోకి వచ్చి నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది. ఆమె ఏ రోజు నాకు భార్యగా వ్యవహరించలేదు. తాను కొన్ని విషయాలలో హద్దు మీరు ప్రవర్తించడం వల్లే తనకు విడాకులు ఇచ్చానని నరేష్ వెల్లడించారు.
ఇక రమ్య తన కుటుంబం నుంచి వెళ్లిపోవడానికి డబ్బు కావాలంటూ తనను బ్లాక్ మెయిల్ చేసిందని, హైదరాబాదులో ఉన్నప్పుడు కూడా తనని డబ్బు కోసం ఇలాగే బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు బెంగళూరుకు వెళ్లి అక్కడ కూడా తన గురించి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని నరేష్ వెల్లడించారు. ఇకపోతే కృష్ణ గారి దగ్గరికి వెళ్లి ఏకంగా 50 లక్షల రూపాయలు డబ్బును డిమాండ్ చేయడంతో నేనే తట్టుకోలేక తనకు పది లక్షల రూపాయలు ఇచ్చానని, ఆ డబ్బు మొత్తం తీసుకుని ప్రస్తుతం తాను ఇలా మాట్లాడుతోంది అంటూ నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Naresh -Ramya Raghupathi : విడాకుల కోసం గన్ గురిపెట్టి బెదిరించిన నరేశ్..రమ్య సంచలన వ్యాఖ్యలు..!