Intinti Gruhalakshmi March 8th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి ఇంటి నుంచి గెంటి వేయడంతో రోడ్డున పడ్డ ప్రేమ్, శృతి లు గుళ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. వారిని గమనించిన గుడిలో పూజారి.. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? పంతాలకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోండి. పెద్దవాళ్లు క్షమిస్తారు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఇక గుడి దగ్గర నుంచి బయలుదేరిన ప్రేమ్, శృతి లు దేవుడే మనకు దారి చూపిస్తాడులే అని బయటకు వెళుతూ ఉండగా ఇంతలో రాములమ్మ కనిపిస్తుంది. మీరు ఏంటి బాబు ఎక్కడ ఉన్నారు అని అడగగా.. పొద్దున్నుంచి ఇక్కడే ఉండిపోయాం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అని అంటాడు ప్రేమ్.

అప్పుడు రాములమ్మ మా ఇంటికి వెళ్దాం పదండి అని అంటూ వారిద్దరిని ఇంటికి తీసుకెళ్లింది రాములమ్మ. ఇంటికి తీసుకెళ్లి వారిద్దరికీ మర్యాద చేస్తుంది. అనంతరం రాములమ్మ అమ్మ అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది తప్పుగా అర్థం చేసుకోకండి బాబు అని అంటుంది.
మరోవైపు తులసి ప్రేమ్ గదిలోకి వెళ్లి ప్రేమ్ ఫోటో ని చూసి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు ప్రేమ్ తన తల్లి చేసిన పిండి వంటలు తింటూ ఉంటాడు. తల్లి ప్రేమని అర్థం చేసుకోలేకపోయినా దివ్య తులసిపై కోప్పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi : రోడ్డున పడ్డ శృతి, ప్రేమ్.. తులసి పై ఫైర్ అవుతున్న కుటుంబ సభ్యులు..?