Janaki Kalaganaledu july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జానకిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో కుటుంబ సభ్యులు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ, అమ్మ జానకీ నీకు నీకు ఏమి కాలేదు కదా అని అడగగా ఏమి కాలేదు అనడంతో అప్పుడు రామచంద్రా నీకు ఏమైనా అవుతుందేమో అని ప్రాణం పోయినట్టు అనిపించింది జానకి గారు అని అంటుంది. అప్పుడు గోవిందరాజు దంపతులు జానకి పొగడడంతో అది చూసి మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది.
![Janaki Kalaganaledu july 11 Today Episode : సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.. జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక..? Janaki Kalaganaledu july 11 Today Episode](https://tufan9.com/wp-content/uploads/2022/07/Rama-Chandra-and-Janaki-recall-their-married-life-and-the-moments-they-spent-together.jpg)
ఆ తరువాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ దంపతులు రామచంద్ర, జానకి లను మరింత దగ్గర చేయాలి అని కొన్ని ఆటలు ఆడించడానికి సిద్ధపడతారు. అప్పుడు జ్ఞానాంబ దంపతులు ఆ గేమ్ గురించి చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జానకిని రామచంద్ర ఎత్తుకుంటాడు.
మల్లిక ని కూడా విష్ణు ఎత్తుకుంటాడు. ఆ తర్వాత గేమ్ మొదలవుతుంది. జానకి రామచంద్ర ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర వాళ్ళు ముందు వెళ్తూ ఉండగా మల్లికా కుళ్ళుకుంటూ విష్ణు ని తొందరగా వెళ్ళు అని సైగలు చేస్తూ ఉంటుంది. అలా చివరికి జానకి వాళ్లే గెలుస్తారు.
Janaki Kalaganaledu: వారసుల కోసం జ్ఞానాంబ ప్లాన్ ఫలిస్తుందా..
మల్లికా ఓడిపోయినందుకు కుళ్లుకుంటూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ కోడళ్లను దగ్గర తీసుకొని ఇద్దరు సమానమే ఇద్దరు గెలిచారు అని అంటుంది. ఆ తర్వాత జానకి, రామచంద్రలు క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి జ్ఞానాంబ దంపతులు మురిసిపోతూ ఉంటారు.
ఇంతలో జానకి అసైన్మెంట్ పేపర్లు తీసుకున్న వ్యక్తి అక్కడికి వస్తాడు. అప్పుడు జానకి అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో అతన్ని చూసి జ్ఞానాంబ వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు జానకి తన ఐఏఎస్ విషయం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియదు అని చెప్పి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉండగా అది అర్థం కాక జ్ఞానాంబ కుటుంబ సభ్యులు అయోమయంలో ఉంటారు.
ఇంతలోనే అక్కడికి అఖిల్ వస్తాడు. ఆ తర్వాత అతను కూడా జానకికి ఇంగ్లీషులో చెప్పడంతో జానకి థాంక్స్ అని చెబుతుంది. అప్పుడు మల్లిక అతని ఎవరు జానకి అని జ్ఞానాంబ దగ్గర ఇరికించే ప్రయత్నం చేయగా అతను చాలా జాగ్రత్తగా మాట్లాడినందుకు జానకి సంతోష పడుతుంది. అప్పుడు ఆ తరువాత అందరూ కలిసి అంతాక్షరి ఆడటానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు గోవిందరాజులు మళ్లీకను టార్గెట్ చేస్తూ పంచుల మీద పంచులు వేస్తాడు.
ఆ తరువాత పాటల ప్రోగ్రాం మొదలవుతుంది. అప్పుడు జ్ఞానాంబ పాటలు పాడడంతో అందరూ సంతోషంగా పాటలు వింటూ ఉంటారు. ఆ తర్వాత జానకి,రామచంద్ర ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పాటలు పాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ చుట్టూ ఉన్నారు అన్న విషయాన్ని మరిచిపోయి ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ పాట పాడుతూ ఉంటారు.