Janaki Kalaganaledujuly 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో పాటలు అయిపోవడంతో వెంటనే పనిమనిషి చికిత ఇప్పుడు కనుక డాన్స్ వేస్తే బాగుంటుంది అని అనగా అందరూ ఓకే అని చెప్పి డాన్సులు వేస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక విష్ణు తో కలిసి డాన్స్ చేస్తూ ఉండడంతో వెంటనే గోవిందరాజులు మల్లికా పై సెటైర్లు వేస్తాడు.
అప్పుడు మల్లిక ముఖమంత ఒకలాగా పెట్టడంతో వెంటనే జ్ఞానాంబ అలా ఏమీ లేదు బాగానే చేశావు అని అంటుంది. ఆ తర్వాత జానకి రామచంద్రలు రొమాంటిక్ పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ దంపతులు జానకి, రామచంద్ర గురించి ఆలోచిస్తూవారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది కానీ ఏకాతంగా గడపడానికి సమయం లేదు అని అనుకుంటారు.
Janaki Kalaganaledujuly 12 Today Episode : జ్ఞానాంబకు ఇచ్చిన మాట తప్పిన జానకి,రామచంద్ర..
ఆ తర్వాత జ్ఞానాంబ దంపతులు ఇద్దరు కొడుకులు కోడళ్లను పొలం దగ్గర సాయంత్రం వరకు ఎంజాయ్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు ఇంటికి వెళ్లిన జ్ఞానాంబ దంపతులు జానకి వాళ్ళ బెడ్ రూమ్ ని పువ్వులతో అలంకరిస్తారు. అప్పుడు గోవిందరాజు దంపతులు వారి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మురిసిపోతూ ఉంటారు.
అప్పుడు గోవిందరాజులు,జ్ఞానాంబ మనసులో వారసుడు కోసం ఆలోచిస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలా వారిద్దరూ వారసుడు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ సీన్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏర్పాట్లు అని చేసే బయటకు వస్తారు. ఇంతలోనే కొడుకు కోడలు ఇంటికి రావడంతో జ్ఞానాంబ దంపతులు వారికి ఎదురుపడతారు.
అప్పుడు జ్ఞానాంబ గుడిలో పడుకుంటే మంచిది అని అనగా వెంటనే జానకి మేము కూడా వస్తాము అని చెప్పడంతో, వెంటనే మల్లిక కూడా వస్తాను అని అనగా అప్పుడు గోవిందరాజులు మల్లికా పై సెటైర్ వేస్తాడు. అప్పుడు జానకిని పక్కకు తీసుకువెళ్లిన జ్ఞానాంబ అసలు విషయాన్ని చెబుతుంది.
అందరూ ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత రామచంద్ర జానకి వారి గదిలోకి చూసి గది మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు జానకి ఎంత చనువుగా ఉన్న రామచంద్ర మాత్రం మీ కల నెరవేరిన తర్వాతే అమ్మ కోరిక తీరుద్దామని అంటాడు. ఇప్పుడు జానకి కూడా అందుకు సరే అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.