Sreeja husband: మెగా స్టార్ అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. అయితే ఈ మధ్య మెగా కుటుంబ సభ్యులు ఈయనకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. ఈయన, శ్రీజ విడాకులు తీసుకోవడమేనంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే కల్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ పోస్టు తన భార్య శ్రీజ కోసమే పెట్టాడంటూ చాలా మంది భావిస్తున్నారు. అయితే ఆ పోస్టు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా కల్యాణ్ దేవ్ తల్లి పుట్టిరోజు సందర్భంగా ఆయన ఓ పోస్టు పెట్టారు. అందులో “జీవితం ఒక్కోసారి చాలా కష్టతరంగా మారుతుంది. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కుంటాననే నమ్మకం నాకుంది. నాకు ఎల్లప్పుడూ నీ సపోర్టు నిలుస్తున్ందుకు థాంక్యూ అమ్మా” అంటూ కల్యాణ్ తన తల్లి మీద ఉన్న ప్రేమను తెలయజేశాడు. ఈ పోస్టులో తాను చాలా కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా శ్రీజ వల్లేనని చాలా మంది భావిస్తున్నారు. అందుకే కల్యాణ్ దేవ్ ఈ పోస్టు పెట్టినట్లు అర్థం అవుతోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అప్పుడు అందరికీ ఈ విషయం గురించి తెలుస్తుంది.