Janaki Kalaganaledu july 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జానకి ఇద్దరు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర జానకి ఇద్దరు రొమాంటిక్ మూడ్ లోకి వెళుతున్న సమయంలో మల్లిక కావాలనే వారిద్దరి ఏకాంతం ను చెడగొడుతుంది. దానితో రామచంద్ర రొమాంటిక్ మూడు నుంచి చేరుకొని వెంటనే ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ జానకి మాత్రం రామచంద్ర తన చదువు కోసం తన ఇష్టాన్ని కూడా వదులుకుంటున్నాడు అని అనుకుంటుంది.
ఆ తర్వాత మల్లిక రామచంద్ర, జానకి లను డిస్టర్బ్ చేసినందుకు సంతోషంతో ఉండగా ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగగా అసలు విషయం చెప్పడంతో విష్ణు షాక్ అవుతాడు. ఆ తర్వాత మల్లిక సిగ్గుపడుతూ డాన్స్ చేస్తూ తొక్క మీద కాలు పెట్టి జారి పడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఏరువాక పూర్ణిమ సందర్భంగా గోవిందరాజు దంపతులు జానకి రామచంద్రలతో పొలం పనులు ప్రారంభించాలి అని అనుకుంటారు.
Janaki Kalaganaledu : ఏరువాక సాగిందిలా…జానకికి ప్రాణాపాయం….
ఆ తర్వాత జ్ఞానాంబ ఇంట్లో అందర్నీ పిలిచి ఆ ఏరువాక గురించి వివరించి పొలం దగ్గరికి వెళ్ళాలి అని చెబుతుంది. అప్పుడు మల్లికా ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేయాలా అని అనుకుంటుంది. కానీ జానకి మాత్రం సంతోషంగా పొలం పనులు చేయడానికి సిద్ధపడుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడికి వెళ్లడానికి బయలుదేరగా జ్ఞానాంబ రామచంద్ర వాళ్ళను బండిపై రమ్మని చెబుతుంది. అప్పుడు మల్లికా కూడా మనం కూడా బండిమీద వెళ్దాం అత్తయ్య ను అడిగు అని చెప్పగా వెంటనే విష్ణు నువ్వే అడుగు అనటంతో అమ్మో నాకు భయం నేను అడగను అంటూ కారులోనే వెళుతుంది మల్లిక.
ఆ తర్వాత రామచంద్ర, జానకి ఇద్దరూ బండి మీద వెళుతూ ఉండగా అప్పుడు రామచంద్ర జానకి చదువు గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు ఏదో ఒకటి చదువుకు అడ్డం వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ జానకి మాత్రం రామచంద్రతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత అందరు పూజ ఏర్పాట్లు చేస్తూ ఉండగా మల్లిక మాత్రం తనలో తానే మాట్లాడుకుంటూ ఏం పని చేయకుండా ఉంటుంది.
అప్పుడు గోవిందరాజులు మల్లిక పై సెటైర్ వేయడంతో, వెంటనే జ్ఞానాంబ మల్లికా పై అరిచి పనిచేయమని చెబుతుంది. పూజ పూర్తి అవ్వడంతో అందరూ పొలం పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు జానకి చేతిలో ఉన్న విత్తనాల బుట్ట కింద పడేయాలి అని మల్లికా ప్లాన్ చేసి కావాలనే జానకి కాళ్లకు కాలు అడ్డు పెడుతుంది. అప్పుడు జానకి కింద పడిపోతూ ఉండగా రామచంద్ర పట్టుకుంటాడు. అప్పుడు జానకి తన చేతిలో ఉన్న బుట్ట గట్టిగా పట్టుకోవడంతో అది చూసి మల్లికా కుళ్ళుకుంటూ షాక్ అవుతుంది.