...

Puri Jagannath: చిరంజీవి-మోహన్ రాజా సినిమాలో పూరి జగన్నాథ్..?

Puri Jagannath: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే జోష్ ని కొనసాగిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మరొక సినిమా గాడ్ ఫాదర్. సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.

అదే ఇది ఇలా ఉంటే చిరంజీవి సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ నటిస్తున్నాడు అని ఆ మధ్య ఒక సారి విజయ్ దేవరకొండ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మెగా అభిమానులతో పాటు పూరి జగన్నాథ్ అభిమానులు కూడా ఇదే విషయం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం పట్ల పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే విజయ్ దేవరకొండ చెప్పిన మాటలకు తెరదించారు చిరంజీవి. మెగాస్టార్ తాజాగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా సెట్ లో పూరి జగన్నాథ్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చిరంజీవికి పుష్పగుచ్చం అందజేసి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. చిరంజీవి నటిస్తున్న ఈ గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని చిరంజీవి ఇమేజ్ కు, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో తో కలిసి లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.