Tamanna : తమన్నా భాటియా ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. ఈమె తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తమన్నాకు యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా తమన్నాకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
ముఖ్యంగా తమన్నా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలు,వెబ్ సిరీస్ అని తేడా లేకుండా వరుసగా నటిస్తూ దూసుకుపోతోంది. అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎఫ్ 3, భోళా శంకర్ ఇలాంటి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమన్నా కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలలో ఎక్కువగా నటించక పోవడంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయని, అందువల్లే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి అని కొన్ని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన తమన్నా.. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, మరొక రెండు సంవత్సరాలు పెళ్లి ప్రస్తావన తన వద్ద తీసుకురావద్దు అని తన తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.
అంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2025 లో తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నా హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ వెబ్ సిరీస్ లు, స్పెషల్ సాంగులు,పలు రకాల యాడ్స్ చేస్తూ పెళ్లి చేతిలో సంపాదిస్తోంది. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గినప్పటికీ తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తమన్నా పారితోషికం కోట్ల రూపాయలలోనే ఉంది.
Read Also : RRR World record: వరల్డ్ లో టాప్-3 గా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్…!