...

ప్రభాసా మజాకా.. ఆ ఒక్క ఫైట్ కే 20 కోట్లు..!

తెలుగు సినీ పరిశ్రమ నుంచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హీరో ప్రభాస్ మరో సంచలనానికి తెరలేపారు. అది ఏంటో తెలుసుకుందామా..?
వామ్మో డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సిరీస్ నుంచి అంచనాలకు అందని స్టార్ డమ్ ను అందుకున్నారు. పాన్ ఇండియాను క్రాస్ చేసి పాన్ వల్డ్ రేంజ్ కి చేరింది ప్రభాస్ మార్కెట్. అందుకు తగిన కాన్సెప్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూతో సినిమా నేర్పిస్తున్నారు మేకర్స్. అలా భారీ నిర్మాణ విలువలతో రూపొందింది ప్రభాస్ సాహో చిత్రం.

ఆ తర్వాత నిర్మాణమైన రాధేశ్యామ్ కూడా భారీ బడ్జెట్ చిత్రమే. కేజీఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డును తిరగరాసి కలెక్షన్స్ కొల్లగొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన తరువాతి చిత్రం కేజిఎఫ్-2 ను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించాడు. అలాంటి చరిత్ర ఉన్న వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సలార్. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకోవడం కోసం మేకర్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ చిత్రాలకు కేజిఎఫ్ సిరీస్ లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దాన్ని అధిగమించి చాలా హై వోల్టేజ్ మూవీగా సలార్ ను రూపొందిస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ భారీ యాక్షన్ సీన్స్ ని క్రియేట్ చేస్తున్నారు.

సగానికిపైగా చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది.ఆమె క్యారెక్టర్ అత్యంత కీలకమైనదని సమాచారం. ఆమె క్యారెక్టర్ కి నెగిటివ్ హ్యాండ్ వుంటుందని వినిపిస్తోంది. ఇక యాక్షన్ సీన్స్ కోసం బాలీవుడ్ టెక్నాలజీతో పాటు హాలీవుడ్ టెక్నికల్ టీమ్ ను కూడా తీసుకొని వస్తున్నారని సమాచారం. ప్రభాస్ ద్విపాత్రాభినయం ఓ స్పెషల్ అట్రాక్షన్. ప్రీ క్లైమాక్స్ తో వచ్చే యాక్షన్ సీన్స్ ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉంటుందట. ఈ ఒక్క ఫైట్ కే ఇరవై కోట్లు ఖర్చు చేయబోతున్నారట. అంతేగా మరీ ప్రభాసా మజాకా అంటున్నారు అతని ఫ్యాన్స్.