Dimple Hayathi : వరుస సినిమాలు చేయాలని.. బ్రేకుల్లేకుండా కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్ని కలలు కంటున్నా కూడా.. మధ్యలో కరోనా వాటికి బ్రేకులు వేస్తుంది. ఇప్పుడు డింపుల్ హయతి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈమెకు కూడా కరోనా రావడంతో కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేకులు తప్పడం లేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

dimple-says-invasion-of-industry-after-corona-decline
ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో డింపుల్ కూడా ఉందిప్పుడు. డింపుల్ హయతీ క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. అద్భుతమైన ఫిజిక్ తో అందర్నీ మాయ చేస్తుంది.ముఖ్యంగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అమ్మడు అదిరిపోయే నడుము అందాలు చూపిస్తూ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో డింపుల్ హయతీ సోకుల వలకు కుర్రాళ్లైతే పిచ్చోళ్ళైపోతున్నారు.
తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది డింపుల్. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. సినిమాలు వచ్చేవరకు ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలంటే హీరోయిన్ల చేతిలో ఉన్న ఒకేఒక ఆయుధం ఫోటోషూట్స్.తన ఉనికి చాటుకోడానికి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ హీట్ పుట్టిస్తుంది.సోషల్ మీడియాలో డింపుల్ హయతీకి ఫాలోయర్స్ కూడా బాగానే ఉన్నారు. సూపర్ హిట్టు నీ హైట్ అంటూ అమ్మాయిగారు వేసిన స్టెప్పులకు విజిల్స్ వేస్తే థియేటర్స్ టాప్ లేచిపోయాయి. ఇప్పటికిప్పుడు అవకాశాలు రావాలన్నా.. ముందు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. హీరోయిన్‌గా అందాలు ఆరబోయాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అన్ని ఇండస్ట్రీలపై దండయాత్రకు సిద్ధమవుతుంది డింపుల్ హయతీ.