...

Acharya -Radhe Shyam: ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు భారీ నష్టాలను ఎదుర్కొన్న సినిమాలివే?

Acharya -Radhe Shyam: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ వద్ద ఎన్నో సినిమాల తలరాతలు మారిపోతాయి.అప్పటి వరకు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు కూడా ఒక్కసారిగా చతికిల పడిపోతాయి. ఇలా సినిమా తలరాతలను థియేటర్ మారుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి.

ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఎదుర్కొన్న సినిమాలో ప్రభాస్ రాధేశ్యామ్ ఒకటి.ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 120 కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సుమారు 84 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది.అలాగే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ఏకంగా 66 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం స్పైడర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 60.50 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. అలాగే ప్రభాస్ సాహో చిత్రం కూడా 52.15 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో మహేష్ బాబు నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చింది. బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, కొమరంపులి వంటి ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.