Nuvvu Nenu Prema Serial Aug 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి మురళి ని చూసి షాక్ అవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. ఆర్య అను ని వాళ్ళ అమ్మకి పరిచయం చేయాలి అనుకుంటాడు. మా అమ్మకి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే అదే అయింది ఎలాగైనా అమ్మ కి అను ని పరిచయం చేయాలి అనుకుంటాడు. వాళ్ళ అమ్మ అని పిలిచి అమ్మ నేను ప్రేమించిన అమ్మాయి ని చూడాలి అనుకుంటున్నావా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ తన ఫారెన్ నుండి వచ్చిందా అయినా కోట్లు తెచ్చే కోడలిని ఎవరు వద్దనుకుంటారు నాకు చూపించు అంటుంది. అమ్మ కోట్ల గురించి ఆలోచించకు నా కళ్ళతో చూడు అంటూ అను వైపు చూపిస్తాడు.
అప్పుడు వాళ్ళ అమ్మ వేరే అమ్మాయిని చూసి నా కోడలు చాలా బాగుంది. నేను తన దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాను అని చెప్పి తన దగ్గరికి వెళుతుంది. నీ పేరేంటి అనగానే ప్రియ అంటుంది. అప్పుడు ఆర్య అమ్మ తను కాదు అని చెప్పినా వినిపించుకోకుండా ఆ అమ్మాయిని నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పక్కకి తీసుకొని వెళుతుంది. నువ్వు చాలా బాగున్నావ్ మీ నాన్న ఏం చేస్తాడు అని అడుగుతుంది.
అప్పుడు ప్రియ మా నాన్న ఫారెన్ లో బిజినెస్ చేస్తాడు అని చెప్తుంది. మీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుంటా అని కుంచల అనగానే ప్రియ అవును మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మా అమ్మ నాన్న కి నేను ఒక్కదాన్నే కూతుర్ని అంటుంది. అప్పుడు కుంచల ఆస్తి మొత్తం నా కొడుకుకే అవుతుంది అంటుంది. అప్పుడు ప్రియ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు కుంచల నీకు అర్థం కాకపోయినా సరే నువ్వే నా కోడలు ఇది ఫిక్స్ అంటుంది.
ఇక మురళి పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనతో మాట్లాడి చాలా రోజులు అయింది. ఎలాగైనా తనతో మాట్లాడాలని కాల్ చేస్తాడు. అప్పుడు పద్మావతి బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయదు. ఇక మురళి బిజీ గా ఉందేమో అనుకుంటాడు. అప్పుడు అరవింద తన దగ్గరికి వచ్చి ఏవండీ కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అంటుంది. అప్పుడు కృష్ణ విక్కీ ఏం చేస్తున్నాడు అనగానే రెడీ అవుతున్నాడు నిన్న పద్మావతి విషయంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ తన మీద కోపంగా ఉన్నాడు అంటుంది.
అప్పుడు కృష్ణ నాకు కూడా అదే కావాలి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగాలి అనుకుంటాడు. ఇక అరవింద తన మీద కోపంగా ఉంటూనే మన ఫంక్షన్కి క్యాటరింగ్ పద్మావతి కి ఇచ్చాడు అంటుంది. అది కృష్ణ వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విక్కీ, మాయలు స్టేజ్ మీదకు వచ్చి వచ్చిన వాళ్లందరికీ వెల్కమ్ చెప్తారు. ఇక వాళ్ళ అక్కని మరియు బావని ఇన్వైట్ చేస్తాడు.
Nuvvu Nenu Prema Serial Aug 15 Today Episode : ఎలాగైనా అరవింద భర్తను చూడాలని డిసైడ్ అయిన పద్మావతి..
అరవింద మరియు కృష్ణ లు స్టేజ్ మీదకి వస్తారు. ఇక పద్మావతి ఎలాగైనా అరవింద వాళ్ల భర్తని చూడాలి అనుకుంటుంది. కుంచల వాళ్ల దగ్గరికి వచ్చి ఏంటి పనులు మానేసి దొంగ చూపులు చూస్తున్నారు ఇక్కడ నుంచి ఏమైనా ఎత్తుకెళ్ళాలి అనుకుంటున్నారా అంటుంది. అప్పుడు పద్మావతి మాది పెట్టే గుణం కానీ తీసుకెళ్ళే గుణం కాదు అంటూ ఆమె మీద కోపడుతుంది. ఇక పద్మావతి అందరికీ జ్యూస్ ఇస్తూ విక్కీ దగ్గరికి వెళుతుంది. విక్కీ జ్యూస్ తీసుకోగానే వద్దు ఇందులో షుగర్ ఉంది మీకు షుగర్ లెస్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళుతుంది. ఇక ఆర్య అను దగ్గరికి వెళ్లి ఏంటండీ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అంటాడు. అప్పుడు అను మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అంటుంది. అప్పుడు ఆర్య మీలో ఈ సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు.
అప్పుడు అను ఏంటండీ అనగానే జ్యూస్ చాలా బాగుంది ఎలా తయారు చేశారు అంటాడు. మీ చేతితో చేయడం వల్ల ఈ జ్యూస్ చాలా బాగుంది. మీ చేతితో ఏది ఇచ్చిన అమృతంలా ఉంటుంది అంటాడు. అయితే ఈ పొగడ్తలన్నీ మా అప్పడం కి చెప్పాలి. ఈ జ్యూస్ తయారు చేసింది తనే అంటుంది. సరే అండి నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.ఇక అరవింద పద్మావతి మరియు అను దగ్గరికి వచ్చి మా ఆయన ను పరిచయం చేస్తాను రండి అంటుంది.
అప్పుడు పద్మావతి ఇందాకటి నుండి చూస్తూనే ఉన్న ఆయన కనిపించడం లేదు ఎక్కడ ఉన్నాడు అంటుంది. అప్పుడు అరవింద ఆయన ఆయన గెస్ట్ లతో మాట్లాడుతున్నాడు అంటుంది. మీలాంటి మంచి వారికి మంచి భర్త దొరుకుతాడు మీతో సెల్ఫీ దిగాలి అంటుంది పద్మావతి. ఇక అరవింద వాళ్ల నానమ్మ అరవింద దగ్గరికి వచ్చి బంధువులను పరిచయం చేస్తుంది. ఇక అను మరియు పద్మావతి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.