Nuvvu Nenu Prema Serial Aug 6 Today Episode : బుల్లితెర ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి రెస్టారెంట్లో జరిగిన దాని గురించి బాధ పడుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. అను పద్మావతి దగ్గరికి వచ్చి ఆర్డర్ గురించి ఏమైంది అమ్మి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా నువ్వు ఏం చెప్పట్లేదు అంటుంది. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లావు కానీ వచ్చినప్పట్నుంచి చాలా డల్‌గా కూర్చున్నావు. అసలేం జరిగింది నన్ను అమ్మ అంటావు కదా మరి అమ్మకు అసలు విషయం చెప్పవా.. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని పద్మావతి చేయి తీసి తన నెత్తిన పెట్టుకుంటుంది.

అప్పుడు పద్మావతి వాళ్ళ అక్కని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అక్క నేను ఆర్డర్ కోసం వెళ్లాను కదా అక్కడ మేనేజర్ మంచివాడు కాదు అమ్మాయిలను ఆసరాగా చేసుకుని వాళ్లని వాడుకోవాలని చూసేవాడు అంటుంది. అప్పుడు అను అమ్మి నీకు ఏం కాలేదు కదా నీకేమైనా అయితే నేను బ్రతకగలన అంటుంది. ఇలాంటివి జరుగుతుందని అత్త మనల్ని ఎక్కడికి బయటికి పంపించదు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమైనా ఉందా అంటుంది. నీకేమైనా జరిగితే అమ్మ నాన్న పరిస్థితి ఏమై ఉండేది అంటుంది. అప్పుడు పద్మావతి ఆ శ్రీనివాసుడు ఈరోజు టెంపరోడిని పంపించినట్టుగా నాకు ఎప్పుడు ఏ అపాయం వచ్చిన నన్ను చూసుకుంటాడు అంటుంది. అప్పుడు అను ఏంటి ఆ టెంపరోడు రక్షించాడా అమ్మి నిన్ను అంటుంది. ఇకనుంచి అతనిని టెంపరోడు అనమాకు ఆడదాని మానం కాపాడాడు అంటే అతనికి స్త్రీల పట్ల చాలా గౌరవం ఉందని అర్థం. విక్రమాదిత్య చాలా మంచి వాడు నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అంటుంది. ఆరోజు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో కూడా నిన్ను కాపాడి మన ఇంటికి తీసుకు వచ్చాడు. ఇక నుంచి అతన్ని అలా అనకు అమ్మి అంటుంది. ఇక నుంచి అతన్ని మంచివాడిలా చూడడం మొదలుపెట్టు నీకు కూడా చాలా కొత్తగా మంచివాడిలా కనిపిస్తాడు అంటుంది.
విక్కీ ఒంటరిగా కూర్చుని పద్మావతి గురించి ఆలోచిస్తాడు. అప్పుడు ఆర్య అక్కడికి వచ్చి ఏంట్రా ఒక్కడివే కూర్చున్నావు ఈమధ్య నువ్వు చాలా మారిపోయావు నీలో చాలా మార్పు కనిపిస్తుంది అంటాడు. నేను ఎప్పుడో మారిపోయాను అంటాడు విక్కీ మార్పు అనేది ఎదుటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అంటాడు ఆర్య. అప్పుడు విక్కీ నువ్వు కూడా నానమ్మ లాగా మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు ఆర్య ఏంటి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లావు అంట తనని చూస్తే నీకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియడం లేదు కానీ తను చాలా మంచిది. ఎప్పుడు ఏదో సాధించాలనే తపన పడుతూ ఉంటుంది. నువ్వు ఆఫీసులో తనని ఎంత బాధ పెట్టినా వెళ్లాలి అనుకోలేదు కానీ ఇప్పుడు ఊరెళ్ళి పోవడానికి సిద్ధం అయింది అంటే తను ఎంత బాధ పడిందో అర్థం చేసుకో అంటాడు. విక్కీ ఇప్పుడు తన గురించి నాకు ఎందుకు చెప్తున్నావ్ అంటాడు. అప్పుడు ఆర్య నిన్ను ఎవరు గుర్తు పెట్టుకున్న చాలా గొప్పగా గుర్తు పెట్టుకోవాలి. ఇక నుంచి తనని కోపంగా చూడటం మానేయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

పద్మావతి ఒంటరిగా నిలుచుని నీ గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా నేను టెంపరోడు అని ముద్ర వేశాన అయినా నువ్వు నాకు పరిచయం అయినప్పుడు చాలా కోపంగా, గర్వంగా ఉన్నావు నేను అలా అనుకోవడంలో తప్పులేదు కదా అని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు విక్కీ కూడా నేను మనసుతో కాకుండా మైండ్ తో ఆలోచిస్తాను అది నీకు చాలా గర్వంగా అనిపించింది అనుకుంటాడు. ఈరోజు నేను ఆ రెస్టారెంట్ మేనేజర్ ఒక్కటే అన్నట్టుగా మాట్లాడావు కానీ నేను అలాంటి వాన్ని కాదు అనుకుంటాడు. అప్పుడు పద్మావతి కూడా నాకు ఈ రోజు తెలిసింది అనుకుంటుంది. ఇక మాయ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టుగా చాటింగ్ చేస్తూ విక్కీ రూమ్ కి వెళ్తుంది. అప్పుడు విక్కీ వాళ్ళ నానమ్మ మాయనీ చూసి నీ వేషాలు నా దగ్గర కాదు అనుకుంటూ మాయని ఫాలో చేస్తుంది.
Nuvvu Nenu Prema Serial : విక్కీ రూంలోకి వెళ్లిన మాయ.. నీ వేషాలు నా దగ్గర కాదంటూ ఫాలో చేసిన శాంతాదేవి
ఇక అను వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న పద్మావతి గురించి అడుగుతారు. అప్పుడు అను పద్మావతి పడుకుంది నాన్న వెళ్లి ఫోన్ ఇవ్వనా అనగానే వాళ్ల నాన్న ఏం వద్దమ్మా పద్మావతి క్యాటరింగ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఉంటుంది పడుకోనీవ్వు అంటాడు. ఇక వాళ్ళ అమ్మ ఏమైనా ఆర్డర్ దొరికిందా అనగానే లేదమ్మా ఇప్పుడే కొత్త కథ కొన్ని రోజుల తర్వాత దొరుకుతుంది అని చెప్తుంది. మీరు అక్కడ ఎలా ఉన్నారు అన్నగానే మా పరిస్థితి ఇక్కడ ఏం బాలేదు అంటారు. అప్పుడు వాళ్ళ అత్త ఫోన్ తీసుకొని మీరు కూడా ఇక్కడికి రండి పిల్లలకి మీ సహాయం కూడా దొరుకుతుంది కదా అంటుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు మేము ఆలోచించుకుని చెప్తాము అక్క అంటాడు. సరే నాన్న ఉంటాను అని చెప్పు ఫోన్ కట్ చేస్తుంది.

ఇక విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మాయ అక్కడికి వచ్చి విక్కీ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడు విక్కీ కోపంతో ఏంటి మాయ ఇది అనగానే నువ్వు లేకుండా నేను ఉండలేను అంటుంది. ఆఫీస్ లో ఉన్నప్పుడే మనం కలిసి ఉండేవాళ్ళం, కలిసి తిరిగే వాళ్ళం కానీ ఇప్పుడు సపరేట్గా ఉండాల్సి వస్తుంది అంటుంది. ఇక వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి లక్ష్మి ని రూమ్ లోకి పంపిస్తుంది. ఇక లక్ష్మీ మాయ దగ్గరికి వచ్చి తన కాళ్లని గిలిగింతలు పెడుతుంది. అప్పుడు మాయ తనకు గిలిగింతలు పెట్టేది విక్కీ అనుకొని ఆగు విక్కీ నువ్వు పైకి చూడడానికి నార్మల్ గా ఉన్న నీలో రొమాంటిక్ యాంగిల్ చాలా ఉంది అంటుంది. అప్పుడు విక్కీ నేనేం చేశాను అనగానే నీ కాళ్ళ తో నాకు గిలిగింతలు పెడుతున్నారు కదా ఆపు అంటుంది.
అప్పుడు విక్కీ లైట్ వేసి చూస్తాడు. అప్పుడు లక్ష్మి అక్కడ కనిపిస్తుంది. అప్పుడు మాయ చిరాకుతో దాన్ని ఇక్కడ నుంచి పంపించు అదంటే నాకు నచ్చదు అంటుంది. ఇక వాళ్ళ నానమ్మ రూంలోకి వచ్చి లక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నావా నీ హద్దులో నువ్వుండు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు అంటుంది. అప్పుడు మాయని చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటుంది. అప్పుడు మాయ గ్రానీ నేను విక్కీ కి గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను అంటుంది. చెప్పావు కదా ఇక వెళ్ళు రేపు ఉదయాన్నే పూజ వుంది వెళ్లి త్వరగా పడుకో అంటుంది. ఇక వికీని కూడా ఎక్కువసేపు మేలుకొని ఉండడం మంచిది కాదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఇక పద్మావతి రుచిగల వంటలను సిద్ధం చేస్తుంది. అప్పుడు అను మరియు వాళ్ళ అత్త ఆర్డర్ ఏమి రాకుండా ఈ వంట ఎందుకు సిద్ధం చేశావు. పెడితే ఏం చేస్తావు అమ్మి అని అడుగుతారు. అప్పుడు పద్మావతి మన వంటలు రుచి చూపించాలంటే మనమే బయటికి వెళ్లి సప్లై చేయాలి ఇక మన వంట నచ్చితే ఆర్డర్ అవే వస్తాయి అంటుంది. అప్పుడు మురళి అక్కడికి వచ్చి సూపర్ పద్మావతి నీ ఐడియా బాగుంది కానీ నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళినా రానీ ఆర్డర్స్ ఆఫీస్ కి వెళ్తే వస్తాయా అంటాడు. అప్పుడు అను పద్మావతి రెస్టారెంట్ కి వెళ్ళిన విషయం నీకు చెప్పలేదు కదా మరి మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇక మురళి కి ఏం చెప్పాలో అర్థం కాక షాక్ అవుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.