Niharika Konidela : నిహారిక కొణిదెల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా అందరికీ పరిచయమైన నిహారిక మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఎన్నో వెబ్ సిరీస్ లో చేస్తూ కెరియర్ లో కొనసాగుతున్న నిహారిక గత ఏడాది జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
వివాహానంతరం ఈమె సినిమాలలో నటించనప్పటికీ పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించారు. వివాహం అనంతరం సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి చేసిన రచ్చ మాములుగా లేదని చెప్పాలి.అయితే గత కొంతకాలం నుంచి నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి.అయితే తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉందని ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని మెగా కుటుంబం ఖండించారు.
ఇకపోతే ఇంస్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ తో కలిసి నిహారిక చేసిన పుష్ అప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిహారిక ఏకంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.ఈ విధంగా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న నిహారిక గత కొద్ది రోజుల క్రితం పబ్ వ్యవహారంలో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. అయితే ఇందులో కూడా తన కూతురు తప్పు లేదని నాగబాబు సమర్థించారు. ఇక ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నిహారిక బయట కనిపించకపోవడంతో మెగా అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పబ్ వ్యవహారం తర్వాత మెగా కుటుంబం నిహారికకు కఠినమైన ఆంక్షలు విధించి తనని హౌస్ అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి సోషల్ మీడియాలో నిహారిక హౌస్ అరెస్ట్ గురించి వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Read Also :Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!