...
Telugu NewsEntertainmentNagarjuna -Akhil: చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయనున్న నాగార్జున... ఇందులో నిజమెంత?

Nagarjuna -Akhil: చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయనున్న నాగార్జున… ఇందులో నిజమెంత?

Nagarjuna -Akhil: అక్కినేని నాగార్జున ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు వరుస టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది ఘోస్ట్ చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఈ సినిమా తర్వాత నాగార్జున గాడ్ ఫాదర్ సినిమా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమా నాగార్జున కెరీర్లో 100వ సినిమా కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బ్రో డాడీ సినిమాకి రీమేక్ చిత్రంగా చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున, అఖిల్ కలిసి మనం సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇక పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన నాగార్జున తదుపరి చిత్రంలో తన చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు