...

Crime News: అనకాపల్లిలో దారుణం.. పిల్లలని చంపి తల్లి ఆత్మహత్య..!

Crime News: కుటుంబ కలహాలతో ఎంతోమంది భార్యాభర్తలు ప్రాణాలు తీసుకుంటుంటే మరి కొందరు మాత్రం ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దనరావుకు తన అక్క కుమార్తె అనూషతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించేవారు. జనార్దనరావు విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి సుదీక్ష , గీతాన్విత అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.జనార్ధనరావు శనివారం సెలవు తీసుకుని పని నిమిత్తం సొంత ఊరు మెట్ట పేట వెళ్ళాడు. భర్త ఊరిలో లేని సమయంలో అనూష అభం శుభం తెలియని తన ఇద్దరూ కుతుర్లని చున్నీతో ఫ్యాన్ కి ఉరి వేసి హత్య చేసింది. వారు మరణించిన తర్వాత తాను కూడా ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.జనార్ధనరావు ఇంటికి వచ్చి చూసేసరికి తన భార్య పిల్లలు ఇలా నిర్జీవంగా పడివుండటంతో షాక్ ఇయ్యడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ లో ఉన్న వివరాలు, వారి బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం అనూష ఆత్మహత్య చేసుకోవడానికి ఇంటి యజమాని పాత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూష భర్త జనార్ధన రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంటి యజమాని నీ విచారిస్తున్నారు.ఇంటి యజమాని మందలించడంతో అనూష మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడిందా అని ఆరా తీస్తున్నారు.