Jr.NTR -Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ అందరికీ తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ఎంతోమంది అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ చిత్ర పరిశ్రమ పై కక్ష సాధిస్తోందని ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమను కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తోందని నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇలా పవన్ కళ్యాణ్ సినిమా పై చంద్రబాబు నాయుడు లోకేష్ స్పందించడంతో సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని ఈ విషయంపై స్పందిస్తూ నారా లోకేష్ కు ఒక ప్రశ్న వేశారు. ఇప్పటివరకు లోకేష్ తన బంధువు వరుసకు బావమరిది అయిన ఎన్టీఆర్ సినిమాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం చెబుతూ తనకు ఏ సినిమా చూడాలి అనిపించినా చూస్తానని ఆ సినిమా నచ్చితేనే ఆ సినిమా గురించి ట్వీట్ చేస్తానని నచ్చకపోయినా ట్వీట్ చేయడం బాగుండదని ఇప్పటివరకు ఎవరి సినిమాల గురించి మాట్లాడలేదని లోకేష్ తెలియజేశారు.ఈ విధంగా లోకేష్ సమాధానం చెప్పడంతో అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలు లోకేష్ కి నచ్చడం లేదా అంటూ పలువురు వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World