...

Most Eligible Bachelor : అక్కినేని అఖిల్ కుమ్మేశాడు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌

Most Eligible Bachelor Collections : అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కరోనా సినిమా సెకండ్ వేవ్ తర్వాత విడుదలకు సిద్ధమైన అఖిల్ మూవీ భారీ హిట్‌గా అవుతుందని అంతా భావించారు.

అనుకున్నట్టుగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు అఖిల్ నటించిన ఏ సినిమాకు రాని కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయని టాక్. కెరీర్‌లో అక్కినేని అఖిల్ తొలి కమర్షియల్ బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్నాడని ఫిలిం వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతవరకు కలెక్షన్ల విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎన్ని వసూళ్లు వచ్చాయనేదానిపై క్లారిటీ ఇచ్చారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ విడుదలైన తొలి 7 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. కరోనా పరిస్థితుల తర్వాత చిత్ర పరిశ్రమ బాగా కుదేలైంది. ఇప్పటివరకు విడుదలైన ఏ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లు సాధించలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల్ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందంటే మామూలు విషయం కాదని నిర్మాతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారట. ఇకపోతే ఈ వారం కూడా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో మరో రూ.10 కోట్ల వసూళ్లు సాధించి రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక అఖిల్ తన సినీ కెరీర్‌లో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నట్టు తెలుస్తోంది. తన సినీ ప్రయాణం ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మంచి హిట్ అందుకోలేదు. హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు స్టోరీ పరంగా ఒకే అనుకున్నా.. పెద్దగా కలెక్షన్లు రాలేదు.

ఎట్టకేలకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కమర్షియల్ హిట్ అందుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
Read Also  : ఈ ట్విస్టులేంటి?.. అసలు ‘మా’ ఎన్నికలు సజావుగా జరిగాయా?