Malli Nindu Jabili Serial Aug 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మాలిని మల్లి వాళ్ళ అమ్మ గురించి అడుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. మాలిని, మల్లితో సుందర్ నీ గురించి అంతా చెప్పాడు. మా పెళ్ళికి మీ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు లోపలికి రానివ్వలేదు అంటుంది. అప్పుడు మల్లి పెళ్లికి అంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మా వాళ్ళు పల్లెటూరి వాళ్ళు వాళ్ల కట్టు బొట్టు వేరే విధంగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు మాలిని పెళ్లికి పెద్ద వాళ్ళని పిలిచేది కానుకలు కట్నాల కోసం కాదు ఆశీర్వాదం కోసం ఇంకోసారి వాళ్లు వచ్చినప్పుడు ఇంటికి తీసుకురా అంటుంది.

Malli Nindu Jabili Serial Aug 16 Today Episode
సరే నేను వెళ్తున్నాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భోజనం చేయి అంటుంది. అప్పుడు మల్లి ఏడుస్తుంది. మాలిని ఏమైంది మల్లి నిన్ను ఏమైనా నేను బాధ పెట్టాను అంటుంది. లేదు అక్క నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది అంటుంది. అప్పుడు మాలిని సరే మీ అమ్మ కి ఫోన్ చెయ్ అంటుంది. అప్పుడు మల్లి మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ లోనే ఫోన్ ఉంటుంది అక్క అంటుంది. అప్పుడు మాలిని సరే లెటర్ రాయి నువ్వు వచ్చినప్పుడల్లా మీ అమ్మ దాన్ని చూసుకుంటుంది అనగానే మల్లి చాలా మంచి ఐడియా ఇచ్చావ్ అక్క కానీ మా అమ్మకు చదవడం రాదు పర్లేదులే మా ఫ్రెండ్స్ చదివి వినిపిస్తారు అంటుంది. ఇక మా అమ్మకి నా చేతి రాత అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ అమ్మకి లెటర్ రాస్తుంది. ఇక మాలిని సరే నేను కాలేజ్ నుండి వచ్చాక ఆ లెటర్ పోస్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఇక మాలిని వాళ్ళ నాన్న మల్లి కోసం హాస్పిటల్ కి వస్తాడు. ఇక మల్లి సంతోషపడుతూ ఇవన్నీ నా కోసమే తెచ్చారా అంటుంది. అవును మా ఇంటి నుండి నీకోసం టిఫిన్ మరియు ఫ్రూట్స్ తీసుకువచ్చాను అంటాడు. టిఫిన్ మరియు ఫ్రూట్స్ తీసుకువచ్చాను అంటాడు. నువ్వు త్వరగా కోలుకున్నాక నీకు రోజు చాక్లెట్ తీసుకు వస్తాను అంటాడు. మల్లి చెయ్యి నొప్పి పెడుతుంటే నీకోసం మంచి ఫిజియోథెరపిస్ట్ ని అరేంజ్ చేస్తాను. ఇక నువ్వు ఎప్పటిలాగే ఎగరవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంటాడు.

Malli Nindu Jabili Serial Aug 16 Today Episode
ఇక మాలిని కి ఏమైనా ఇబ్బంది కలిగితే నేను ఎలా బాధపడతాను ఇప్పుడు మల్లి విషయంలో కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకు అలా అనుకుంటాడు. ఇక మీ అమ్మగారు ఎలా ఉన్నారు మల్లి అని అడుగుతాడు. నేను అక్కడికి వెళ్లాను కదా చాలా సంతోషంగా ఉంది అంటుంది. అప్పుడు మాలిని వాళ్ళ నాన్న మా అమ్మగారు కూడా ఊరెళ్ళారు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి, భార్య బిడ్డల కి దూరంగా ఉండాల్సి వస్తుంది అంటాడు. అప్పుడు మల్లి మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను అని బాధపడతాను అంటుంది.
Malli Nindu Jabili Serial Aug 16 Today Episode : మీరాకు మల్లి రాసిన లెటర్ చూసి షాకైన శరత్ చంద్ర.. మల్లిని తన కూతురుగా ఒప్పుకుంటాడా?
అప్పుడు శరత్ చంద్ర.. నేనే మీ నాన్న అనుకో అంటాడు. అప్పుడు మల్లి మా నాన్న మీలా ఉండడు మీ అంత మంచివారు అయితే మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్లడు కదా ఒకవేళ మీరు చెప్పినట్టు పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన ఎప్పుడో ఒకప్పుడు నన్ను చూడడానికి రావాలి కదా కానీ ఒక్కసారి కూడా నా కోసం రాలేదు అంటుంది. నిజానికి ఏ తండ్రి అయినా తన బిడ్డ ఎలా ఉంది ఏం చేస్తుంది చదువుకుంటుదా లేదా అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ మా గురించి తెలుసుకోలేదు. కనీసం మా బాగోగులు కూడా చూసుకోలేదు. నిజానికి ఆయన మా నాన్న కాదు ఆయన ఒక పిరికివాడు అలాంటి వాణ్ణి మీతో పోల్చకండి అంటుంది.

Malli Nindu Jabili Serial Aug 16 Today Episode
ఇక సుమిత్ర మల్లి గురించి ఆలోచిస్తుంది. అప్పుడు రూప ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అంటుంది. ఏం లేదు మల్లి దగ్గర ఉన్నా తాళిబొట్టు, మెట్టెల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు అనుపమ ఆ విషయం గురించి మాలిని తెలుసుకుంటాను అన్నది కదా ఇప్పటికల్లా తెలుసుకునే ఉంటుంది అంటుంది. అప్పుడు మాలిని అక్కడికి వచ్చి అవును అత్తయ్య తెలుసుకున్నాను. మల్లి కి పెళ్లి జరగలేదట వాళ్ళ ఊర్లో ఆచారం ప్రకారం ఆడపిల్ల బయటికి వచ్చినప్పుడు అవన్నీ తనతో ఉంటే మంచి భర్త దొరుకుతాడు అని నమ్మకం అంట.. అందుకే వాళ్ళ అమ్మ పెట్టిందేమో అని చెప్పింది అత్తయ్య అంటుంది. అప్పుడు రూప చూశారు కదా మల్లికి పెళ్లి జరగలేదు మీరు అనవసరంగా కంగారుపడ్డారు. వాళ్లది పల్లెటూరు కాబట్టి ఇలాంటి నమ్మకాలు ఉంటాయి అంటుంది. అప్పుడు సుమిత్ర మరియు అనుపమ మేము మల్లి నీ అనుమానించలేదు. తన జీవితం చిన్న వయసులోనే పాడైపోయింది ఏమో అని బాధపడ్డాను అంటుంది.
మనమే మల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటారు. ఇక మాలినీ వాళ్ళ నాన్న మల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా నీ చేతిలో ఉన్నది అని అడుగుతాడు.మా అమ్మకి లెటర్ రాశాను అయ్యగారు ఏమనుకోకుండా మీరు వెళ్ళేటప్పుడు దీన్ని పోస్ట్ చేసి వెళ్తారా అంటుంది. సరే పోస్ట్ చేస్తాను అడ్రస్ చెప్పు అంటాడు. ఇక మల్లి అడ్రస్ చెప్తుంది. ఇక మీ అమ్మ పేరు కూడా చెప్పు అనగానే నేను నా నోటితో మా అమ్మ పేరు చెప్పలేను రాస్తాను అని చెప్పి లెటర్ మీద మీరా అని రాస్తుంది. ఇక లెటర్ మీద ఉన్న మీరా అనే పేరు ని చూసి షాక్ అవుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి.