Devatha April 21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి సత్యకు పిల్లలు పుట్టాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అనగా ఆ మాటలకు రాధ ఎమోషనల్ అవుతుంది.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో దేవి, సత్యకీ పిల్లలు పుట్టాలంటే ఏ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అనగా అప్పుడు రాధ బిడ్డ ఆ సారు కీ పిల్లలు పుట్టిన నువ్వంటే చాలా ఇష్టం అని దేవికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా దేవి వినదు. ఇంతలో మాధవ అక్కడికి వచ్చి రాధ చేయి పట్టుకుని పక్కకు పిలుచుకొని వెళ్తాడు.
అప్పుడు రాధ ఏంటి సారు మీరు నా చేయి పట్టుకున్నారు అని అడగగా అప్పుడు మాధవ నీ చేయి పట్టుకున్నందుకు నీకు బాధగా ఉంటే పసి పిల్లల బాధ నీకు అర్థం కాలేదా అంటూ నిలదీస్తాడు మాధవ. ఇంతలో మాధవ కన్నీళ్లు పెట్టుకుంటూ తన చేతులోని కండువా చేతిలో పట్టుకొని చేయి చాస్తూ.. దేవిని నాకు దత్తత ఇవ్వు రాధా కంటికి రెప్పలా చూసుకుంటాను..
నువ్వు అనుకున్న స్థాయిలో దేవిని నిలబెడతాను కావాలంటే నా ఆస్తి మొత్తం అయినా అమ్మేస్తాను అని వేడుకుంటాడు. అప్పుడు సరే అని రాధ అనడంతో నిజంగానే ఇస్తావా అని అడుగుతాడు మాధవ. ఇస్తాను కానీ ఆఫీసర్ కి ఇచ్చిన మాట నేను తప్పితే గా పొద్దు నేను ఉండను.. ఆ రోజు దేవి నీ మీరు తీసుకుంటే నేను వెళ్ళి పోతాను అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పడు మాధవ ఆగు రాధ అని చెప్పి దేవినీ ఆదిత్య కు దత్తత ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు రాధ, మాధవ మాటలకు ఆనంద పడుతుంది. నిజంగానే మీరు దేవిని దత్తత ఇవ్వమంటున్నారా అని రాధ మాధవ నీ అడగగా అవును అని బాధతో అంటాడు మాధవ. అప్పడు రాధ ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.