Devatha May 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో మాధవ కారు ఆపి ఎక్కమంటూ బలవంతం చేస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ కారులో కూర్చోమని ఎంత బ్రతిమలాడినా కూడా రాద ఎక్కడానికి ససేమిరా అని అంటుంది. అప్పుడు మాధవ ఊర్లో వాళ్లు మన ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలిసిందే కదా అని అనగా అప్పుడు రాధ నాకు ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు అని గట్టిగా చెబుతోంది.
అయినా కూడా మాధవ విసిగిస్తుండడం తో రాధ వెళ్లి కారులో కూర్చుంటుంది. మరొకవైపు దేవుడమ్మ సత్య ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్ళగా హాస్పిటల్ లో డాక్టర్ సత్య రిపోర్ట్స్ ని పరిశీలించి సత్య గర్భసంచిలో ప్రాబ్లం ఉందని ఇక ఎప్పటికీ సత్య కి పిల్లలు కలిగే భాగ్యం లేదు అని అనడంతో సత్య ఎమోషనల్ అవ్వగా దేవుడమ్మ ఓదారుస్తుంది.
మరొకవైపు రాధా కారు దిగి ఇంటికి వెళ్తుండగా మాధవ మాట్లాడటంతో అప్పుడు రాధా మాధవ పై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత చిన్మయి కోసం ఆదిత్య రామ్మూర్తి ఇంటికి వస్తూ ఉండగా దారిలో వెనకాల నుంచి దేవి నాయనా అని పిలుస్తున్నట్లు అనిపించడంతో వెంటనే కారు ఆపి చూడగా అదంతా తన ఊహ అని అనుకుంటాడు.
ఎలా అయినా అసలు విషయాన్ని తెలుసుకోవాలి అని మాధవ ఇంటికి ఉండగా ఇంతలో దేవుడమ్మ ఫోన్ చేసి నీకెన్ని అర్జెంటు పనులు ఉన్నా ఇంటికి రావాలి అని చెప్పడంతో వెంటనే ఆదిత్య ఇంటికి బయలుదేరుతాడు. మరొకవైపు దేవుడమ్మ సత్య డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు.
మా ఇంట్లో వారికి సత్యకు పిల్లలు పుట్టరు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తరువాత ఆదిత్య వాళ్ళ బాబాయ్ రాధా ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు గర్భవతి అని చెప్పడంతో దేవుడమ్మ తోపాటు ఆదిత్య అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World