Intinti Gruhalakshmi March 12th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్,శృతి ల కోసం ఏడుస్తూ బాధపడుతున్న దివ్యాని ఓదారుస్తూ మీ అమ్మ ను ఒప్పించి ఎలా అయినా నేను ప్రేమ్ ని ఇంటికి తీసుకుని వస్తాను అని నందు దివ్య కు మాట ఇచ్చి వెళ్తాడు. అక్కడినుంచి నందు నేరుగా తులసి దగ్గరికి వెళ్లి తులసి పైర్ అవుతాడు. ప్రేమ్ వచ్చేవరకూ దివ్య అన్నం తినను అంటుంది అని అనగా ప్రేమ్ నీ పిలుచుకు రా అని చెప్పే బదులు మీరు తీసుకు రావచ్చు కదా అని అంటుంది తులసి.
అప్పుడు నందు మాట్లాడక పోయేసరికి సరే ప్రేమ్ ని నేను పిలుచుకుని వస్తాను. కానీ ప్రేమ కు వచ్చిన తర్వాత గొడవ పడను అని మాట ఇస్తారా అని అడగగా దానికి నందు కూడా సరే అని అంటాడు. మరొక వైపు ప్రేమ్ పరిస్థితి చూసి ప్రేమ్ ఫ్రెండ్స్ బాధపడుతూ ఉంటారు.
అంతేకాకుండా తులసి ఆ విధంగా చేసింది తప్పక ఆశ్చర్యపోతారు. పదరా ప్రేమ్ ఇంటికి వెళ్దాం ఆంటీని ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాను అని అనగా ఆ ప్రేమ వద్దులే అని అంటాడు. ఇక తన వద్ద ఉన్న మొబైల్ ను అమ్ముతాను అని చెప్పగా ప్రేమ్ ఫ్రెండ్స్ వారి దగ్గర ఉన్న ఆ తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి వెళ్తారు. మరొకవైపు ప్రేమ్, శృతి ల కోసం దివ్య బాధపడుతూ ఉంటుంది.
దాన్ని అవకాశంగా తీసుకున్న లాస్య ఎలా అయినాసరే దివ్య అనే తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే దివ్యా కు మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ ను తాగిస్తుంది. అది చూసిన తులసి ఆనందం వ్యక్తం చేస్తూ రాములమ్మను గట్టిగా హత్తుకుంటుంది. మరొక వైపు శృతి జరిగిన విషయం గురించి ఆలోచిస్తుండగా అక్కడికి వచ్చిన ప్రేమ్, శృతి కి తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి తన ఫ్రెండ్ హెల్ప్ చేశారు అని ఆనందంగా చెబుతాడు.
మరొకవైపు దివ్య బాధని అడ్వాంటేజ్ గా తీసుకున్న లాస్య దివ్య అని తన వైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దివ్య నీ కోసం ఏమైనా చేస్తాను అని అనగా అప్పుడు దివ్య ఐ లవ్ యూ అంటూ కౌగిలించుకుంది. అది చూసిన తులసి బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi: దివ్యకి దగ్గరవుతున్న లాస్య.. తులసి ఏం చేయనుంది..?