Guppedantha Manasu March 12th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గౌతమ్, వసు గురించి గొప్పగా పొగుడుతూ ఏంజెల్ అని అంటూ ఉండగా అప్పుడు చూసి ఒరేయ్ పిచ్చి పిచ్చి గా మాట్లాడకు తనకు ఒక అందమైన పేరు ఉంది వసుధార అని పిలువు.. లేదంటే మర్యాదగా ఉండదు అని అంటాడు రిషి. అలా వారి కొద్దిసేపు ఫన్నీ గా మాట్లాడుతూ ఉండగా మధ్యలో గౌతమ్, జగతి ప్రస్తావన తెస్తూ జగతి మేడం మంచిది అని అనగా రిషి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రిషి తినడానికి కూర్చుంటాడు. అప్పుడు ధరణి తో డాడీ తిన్నాడా అని అడగగా అప్పుడు ధరణి మామయ్య ఇంట్లో లేరు అని చెబుతుంది. వెంటనే రిషి సరేలే వదిన డాడీ వచ్చిన తరువాత తింటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార, జగతి, మహేంద్ర లు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో మహేంద్ర పొలమారగా ఎవరో కలుసుకుంటున్నారు అని వసు అనగా ఇంకెవరు నా పుత్రరత్నం అని అంటాడు మహేంద్ర.
అంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఇక మహేంద్ర భోజనం చేయకుండా మధ్యలోనే ఆపేసి వెళ్తాడు. ఇక రిషి ఎంత ఆపిన ఆగకుండా వెళ్లడంతో మహేంద్ర స్పీడ్ గా వెళ్లి రిషి కారు కి అడ్డంగా కారు నిలబెడతాడు.రోడ్డు మధ్యలో వాళ్ళిద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. మరొక వైపు దేవయాని ధరణి పై విరుచుకు పడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు ఏం పని చేయవు మహేంద్ర, రిషి ఎక్కడికి వెళ్తున్నారు అడగవు ఏంటి ధరణి నువ్వు నాకు అర్థం కావు అనే మండిపడుతూ ఉంటుంది.

ఇంతలో రిషి రాగా ఎక్కడికి వెళ్లావు రిషి అనగా ఇప్పుడే వస్తాను పెద్దమ్మా అని వెళ్ళిపోతాడు. ఇంతలో మహేంద్ర కూడా వస్తాడు. అప్పుడు దేవయాని మాట్లాడుతూ ఏంటి మహేంద్ర నువ్వు రిసీవ్ గురించి పట్టించుకోవా, తిన్నాడా లేదా అని అడగవా అంటూ రిషి పై అతి ప్రేమ ను ఒలకబోస్తోంది. మహేంద్ర మాట్లాడిన మాటలకు దేవయాని కోప్పడుతూ ఉంటుంది.
మరొక వైపు వసు కాలేజీకి బయలుదేరుతూ మధ్యలో రాసి ఇచ్చిన నెమలి ఈక ను చూసి దాని చూసి ప్రేమ గా మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు జగతి రిషి ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసు రాగా నేను కూడా కాలేజీకి వస్తాను అని జగతి అనగా అప్పుడు వసు ఆనందపడుతుంది.
మరొకవైపు కాలేజీ స్టాప్ మహేంద్ర నువ్వు జగతిని మీతో పాటు పిలుచుకొని వెళ్లొచ్చు కదా అని అడగగా, మేడం ఇది మా పర్సనల్ కాలేజీలో దయచేసి మాట్లాడవద్దు అని అనగా ఆ మాటలు తీసి వింటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న దేవయాని..?