Kasturi Serial Actress : తెలుగు వచ్చిన అన్నమయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన కస్తూరి ఆ తర్వాత కూడా అనేక తమిళ సినిమాల్లో ఆడిపాడింది. కానీ ఈమెకు అవేవీ పనికిరాలేదనే చెప్పాలి. అందుకోసమే కస్తూరి ఇప్పుడు బుల్లితెర మీద హంగామా చేస్తోంది. ఒకప్పుడు వెండి తెర మీద అందాల విందు చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు బుల్లితెర మీద అభినయాన్ని ప్రదర్శిస్తుంది.
రీసెంట్ గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే కస్తూరిది అందులో మధ్య తరగతి గృహిణి పాత్ర. మధ్య తరగతి గృహిణిలా కస్తూరి చక్కగా ఒదిగిపోయింది. ఈ సీరియల్ కు రేటింగ్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీరియల్ అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
ఇలా ఉండగా.. కస్తూరి ఈ మధ్య ఓ షోలో పాల్గొంది. ఆ షోలో తన నిజజీవితంలో జరిగిన షాకింగ్ ఘటనలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయింది. తాను మూడు సార్లు చావు నుంచి బయటపడ్డానని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేసింది. రెండు సార్లు తన తల్లిదండ్రుల వలన ఒక సారి తన కూతురు వలన ఈ సంఘటనలు జరిగాయని చెప్పుకొచ్చింది.
తనకు బంగ్లాలు, ఆస్తులు గట్రా ఏమీ వద్దని కేవలం తన కూతురు ఉంటే చాలని చెప్పింది. ఈ భామకు ఒక కూతురుతో పాటు కొడుకు కూడా ఉన్నాడు. సినిమాలకు దూరమయిన తర్వాత ఈ బ్యూటీ ఇలా బుల్లితెర మీద హంగామా చేయడం కొత్త అనుభూతి అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక తులసిగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ కష్టాలను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు.
Read Also : Chiranjeevi Tulasi : మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన ప్రొడ్యూసర్.. అసలు విషయం బయటపెట్టిన తులసి..