Viral News: ప్రస్తుత కాలంలో ఎప్పుడూ చూడని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ జరగని వింతలు, విశేషాలు జరుగుతున్నాయి. అంతు పట్టని కారణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సంఘటనే ఇటీవల దక్షిణ ప్రావిన్స్ మెర్సిన్ లోని సీరీస్ ప్రాంతానికి చెందిన హిసేయిన్, ఐసెల్ టోసెన్ దంపతులకు పశుపోషణ జీవనాధారం. కాగా ఇద్దరూ జంతు ప్రేమికులు కావడంతో మేకలు, పశువులు లాంటి జంతువులను చేరదీసి, జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ మందలో ఉన్న ఒక మేక తాజాగా మరొక మేక పిల్లకు జన్మనిచ్చింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ? జన్మనివ్వడం మామూలు విషయమే. కానీ ఆ మేకపిల్ల సహజంగా కాకుండా కొంచెం భిన్నంగా ఉండడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వెంట్రుకలు లేకుండా, జెట్ నలుపు ముడతలు కలిగిన చర్మంతో పుట్టిన ఈ మేకపిల్లను ఆ దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
ఈ విషయం తెలిసిన గ్రామస్తులతో పాటు, చుట్టు పక్కల వారు ఆ మేకపిల్లను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ అసహజ రూపంలో ఉన్న మేకపిల్లను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోతో పాటు, ఆ మేకపిల్ల కూడా వైరల్ గా మారింది. ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు ప్రజలు ఆనాడు బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.