Intinti Gruhalakshmi Today Episode Feb 18 : బుల్లితెరపై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి.. ఈ డైలీ సీరియల్ ప్రతిరోజు ఊహించని మలుపులతో వీక్షకులలో ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. మరి ఈ రోజు ప్రసారం కానున్న ధారావాహిక 559 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓ లుక్కెయ్యండి.

అభి ఈజీ మనీ కోసం తప్పుదారి పడుతున్నాడని తులసి అంకిత అనుకున్నట్టుగానే అభి ఎవ్వరూ ఊహించని విధంగా 10 లక్షలు అప్పు చేయడం.. ఆ డబ్బులు తీసుకున్న తన ఫ్రెండ్ మనోజ్ మోసం చేయడం.. అభి మనోజ్ నీ మోసం చేశావని అడిగే ప్రయత్నంలో.. తోపులాట చోటుచేసుకుని మనోజ్‌ని పక్కకు తోయగా అది కాస్తా హత్యగా చిత్రీకరించడం జరిగిపోయాయి.. ముందు నుంచి మామ్ చెబుతూనే ఉంది కానీ నేనే వినలేదని అభి మనసులో చాలా బాధ పడుతూ ఉంటాడు.
ఈ కష్ట సమయంలో తనకు సహాయం చేయగలిగేది అమ్మేనని తెలుసుకుని.. ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి తన ఫోన్లో నుంచి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. అభి గొంతు గుర్తు పట్టి తులసి నాన్న అభి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు మామ్.. నేను చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మామ్ అని అడుగుతాడు. నువ్వు నిజంగానే తనని చంపే ప్రయత్నం చేశావా అని అభిని తులసి అడుగుతుంది.. నేను చెయ్యలేదు మామ్ అంటాడు అలా అయితే నువ్వేమీ కంగారు పడకు నీకు ఈ అమ్మ ఉంది. ఏం చేసినా రక్షించుకుంటుంది అని అభికి ధైర్యం చెబుతుంది.
Intinti Gruhalakshmi Today Episode Feb 18 : ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే..
నందు లాస్య రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతారు. కోపం వచ్చిన వాళ్ళ అమ్మానాన్న నందుకి చివాట్లు పెడతారు. మీనాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నువ్వు ఇలాగే పట్టించుకోకుండా వదిలేసావని.. ఇప్పుడు అభికి ఇలా జరిగితే నువ్వు పట్టించుకోవడంలేదని.. ఇంత జరుగుతుంటే ఎంతసేపటికి కఠినంగా ఎలా మారిపోయావని నందు వాళ్ల అమ్మ అంటుంది. దానికి అభిని ఎలా ఈ గండం గట్టెక్కించాలా అని లాయర్ సలహాలు తీసుకుంటున్నాను అంటాడు నందు. అంతకంటే పెద్ద గండం శశికళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మనం అందరం నడిరోడ్డు మీద పడతాం.. ముందు దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నా అని చెబుతాడు.
ఇక అభిని వెతకడం కోసం వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. తులసి అభిని అడిగి ఏం జరిగిందో తెలుసుకునే లోపే పోలీసులు వస్తారు. అభి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా నువ్వు మాకు దొరికేవరకు మీ అమ్మను స్టేషన్‌లోనే ఉంచుతామని పోలీసులు చెబుతారు.. ఆ ఎస్సై తులసితో నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏంటి నీ మొగుడు ఏడి అని అడుగుతాడు. నాకు భర్త లేడని తులసి చెబుతుంది. వీడికి తండ్రి ఎవరో కూడా తెలీదు అని చాలా నీచంగా మాట్లాడతాడు.. కోపం వచ్చిన అభి ఎస్సై కాలర్ పట్టుకుంటాడు.. దాంతో సీన్ ఊహించని విధంగా తయారవుతుంది. ఇంక ఎస్సై అభిని ఏం చేయనున్నాడు..!? తులసి, అభిలను కాపాడటానికి నందు ఏం చేయను ఉన్నాడో తరువాయి భాగంలో చూడాలి.
Read Also : Intinti gruhalakshmi: అభి విషయంలో తులిసే ముద్దాయి… పోలీసులకు చిక్కిన అభి..!