...

Intinti gruhalakshmi: అభి విషయంలో తులిసే ముద్దాయి… పోలీసులకు చిక్కిన అభి..!

Intinti gruhalakshmi: సాధరణ ఉమ్మడి కుటుంబం ఎదుర్కొనే సాధకబాధకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించే సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 17 ఫిబ్రవరి 2022 హైలైట్స్ ఏంటో చూద్దాం. డబ్బుల కోసం గొడవపడి ఫ్రెండ్‌ను పొడిచి పారిపోయాడు అని ఎస్ఐ నందుతో చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. లేదు ఎస్ఐ గారు మా అభి ప్రాణాలు పోసే డాక్టర్.. ప్రాణాలు తీసే డాక్టర్ కాదు అంటుంది తులసి. అవునో.. కాదో వాడినే అడిగితే చెబుతాడు. కానిస్టేబుల్స్.. ఇల్లంతా వెతకండి.. అంటాడు ఎస్ఐ. లోపల అభి కనిపించడు. మీ వాడు పొడిచిన వాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడు పొరపాటున చావాలి కానీ.. మీవాడికి యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

gruhalakshmi serial latest episode

ఇంతలో అంకిత స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అభి.. తన ఫ్రెండ్ రాజు ఇంటికి వెళ్తాడు. అంకితతో గొడవ పడి వచ్చాను. దానితో రాత్రికి అక్కడ ఉండేందుకు ఓకే అంటాడు రాజు. రాజు ఫోన్ తీసుకొని అంకితకు ఫోన్ చేస్తాడు అభి. కానీ.. అంకిత ఫోన్ రూమ్లో ఉండటంతో తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో అడ్వకేట్‌కు కాల్ చేసి అసలు విషయం చెబుతుండగా రాజు భార్య వింటుంది. మర్డర్ చేసి వచ్చిన వాడికి షెల్టర్ ఇస్తావా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి అంటుంది రాజు భార్య.

తులసి వల్లనే ఇప్పుడు అంకితకు ఈ గతి పట్టింది అంటుంది లాస్య. రేపు జరగకూడనిది జరిగి.. హాస్పిటల్లో ఉన్నవాడు పోతే ఇంకేముంది.. అంకిత, అభి విడిపోయి బతకాల్సిందే కదా. దానికి కారణం ఎవ్వరు తులసినే కదా అంటుంది లాస్య.

ఇంట్లో అందరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా ఇలా మాట్లాడటానికి బుద్ధి లేదా అంటుంది తులసి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే తులసే కారణం అని చెబుతాను.. కోర్టులో కూడా అదే చెబుతాను అంటాడు నందు. దీంతో అనసూయ, పరందామయ్య.. తులసికి సపోర్ట్ చేస్తారు.

నీకు బాధ్యత మోయడం చేతగాక తులసి మీద అరుస్తున్నావా? నువ్వు నా కొడుకుగా ఏం చేశావురా.. అని ప్రశ్నిస్తాడు పరందామయ్య.

మరోవైపు అభికి ఏం చేయాలో అర్థం కాదు. తులసి చెప్పిన విషయాలనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అభి. ఇంతలో రాజు పోలీసులకు ఫోన్ చేస్తాడు. వెంటనే అక్కడికి పోలీసులు వస్తారు దానిని గమనించిన  అభి.. వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు.

అంకిత ఏడుస్తూనే ఉంటుంది. అభిని మనం అందరం అవమానించాం.. అందుకే అభి దూరం అయ్యాడు.. అంటుంది అంకిత. నా బిడ్డ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డం వేసి అయినా సరే కాపాడుకుంటాను అంటుంది తులసి. ఇంతలో మాధవి వస్తుంది. ఏంటి వదిన ఇదంతా అంటుంది. తలరాత అంటుంది తులసి. నేను ఆరోజు లక్ష రూపాయలు ఇవ్వడం వల్లే అలా జరిగింది అంటుంది మాధవి.

ఇంతలో అభి రోడ్డు మీద పరిగెడుతుంటాడు. ఎదురుగా పోలీస్ వాహనం వస్తూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే పక్కనే ఉన్న ఆటో ఎక్కుతాడు అభి. దీంతో ఆటో వ్యక్తి దిగు అంటాడు. ఇంతలో పోలీస్ జీప్ వెళ్లిపోతుంది. మరోవైపు తులసికి కనిపిస్తాడు అభి. తులసి వద్దు అన్నా తనను నెట్టేసి వెళ్లబోతాడు అభి. ఇంతలో పోలీసులు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయిభాగంలో చూడాల్సిందే.