Horoscope Today March 18th : ఈ రాశుల వారు హోలీ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి!

Horoscope Today, March 18: This Zodiac Signs People need to be careful on Holi 2022
Horoscope Today, March 18: This Zodiac Signs People need to be careful on Holi 2022

Horoscope Today March 18th : ఈ రోజు ఫాల్గుణ శుక్ల పక్షం.. తిథి (March 18, 2022) పౌర్ణమి.. అందులోనూ వారం శుక్రవారం కలిసి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12.47 వరకు పౌర్ణమి ఉంటుంది. ఆ తర్వాత చైత్ర శుక్ల పక్షం ప్రతిపద తిథి ప్రారంభమవుతుంది. హోలీ రంగుల పండుగ రోజున మీరోజు ఎలా ఉండనుంది.. ఏయే రాశుల వారు హోలీ పండుగ రోజున జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం..

మేషరాశి :
ఈ రోజు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ విజయాలకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన విషయాలపై కొంతమంది ప్రత్యేక వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మీ దినచర్యలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపాధి అవకాశాలు లాభిస్తాయి.

Advertisement

వృషభం :
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో భాగస్వామ్యాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమికులకు వారి పార్టనర్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు సమాజానికి సంబంధించిన పనుల్లో ముందుంటారు. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పని చేయడం వల్ల లాభాలు వస్తాయి. ఆర్ట్స్ విద్యార్థులు తమ చదువులో ఉపాధ్యాయుల సహాయం పొందుతారు.

మిధునరాశి :
మీరు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఎవరికైనా సాయం చేసిన అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీ క్రియేటివి అందరికి తెలుస్తుంది. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మరింత ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.

Advertisement

కర్ణాటక రాశి :
ఈ రోజు, తల్లిదండ్రుల సహాయంతో మీ ప్రత్యేక పనిలో కొన్ని పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే.. మీరు మంచి వైద్యుడిని సంప్రదించాలి. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనిలో విజయం సాధించడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. మీరు నెగటివ్ ఆలోచనల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి :
మీరు పనిచేసే చోట సహోద్యోగులు మీ ఆలోచనలకు ఆకర్షితులవుతారు. మీరు కోరుకున్న పనిని పూర్తి చేయడంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరితోనైనా చర్చించే అవకాశం ఉంది. ప్రేమికులు కుటుంబ సభ్యులతో తమ ప్రేమ గురించి చెబుతారు. సంతానం పొందే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

కన్య :
ఈ రోజు మీరు ధరించే దుస్తులను ఆఫీసులో తోటి ఉద్యోగులు మెచ్చుకుంటారు. వాణిజ్య విద్యార్థులకు తోటివారి నుంచి మద్దతు లభిస్తుంది. ఏ సబ్జెక్ట్‌లో వచ్చిన సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుంది. మీ పనులు సమాజంలో చర్చనీయాంశమవుతాయి. వ్యాపార రంగంలో ఇతర వ్యక్తులను సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించి మీ ఆలోచనలో మార్పు ఉంటుంది.

తులారాశి :
మీరు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆఫీసులో ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మృదువైన భాషను వాడండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. వారితో కలిసి గుడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చట్టపరమైన అంశంలో పేపర్లు పూర్తి కానందున, అది పూర్తి చేయడానికి సమయం పడుతుంది.

Advertisement

వృశ్చికరాశి :
ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీసుల్లోని వ్యక్తుల సహకారం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆదాయం పూర్తిగా పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు అని చెప్పాలి. మీ పిల్లలు ఏదో ఒక పనిలో విజయం సాధించడం వల్ల మీలో సంతోషం పెరుగుతుంది.

Horoscope Today March 18th : This Zodiac Signs People need to be careful on Holi 2022
Horoscope Today March 18th : This Zodiac Signs People need to be careful on Holi 2022

ధనుస్సు రాశి :
ఈరోజు మీరు మీ తెలివితేటలతో అన్ని పనులను నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు కలిసి పని చేసే వారి నుండి సహాయం అందుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళతారు. ఈ రాశి విద్యార్థుల్లో పోటీపై అవగాహన కల్పిస్తారు. పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ప్రేమికులు ఈరోజు మీ పనిలో సహకరిస్తారు.

Advertisement

మకరరాశి :
ఈ రోజు మీకు మంచి రోజు కానుంది. మీరు ఏ విషయంలోనైనా పిల్లలతో విభేదించవచ్చు. విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుని నుంచి ప్రత్యేక మార్గదర్శకత్వం పొందుతారు. ఈ రోజు మీలో ప్రవర్తనతో జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి :
ఈ రోజు మీకు గొప్ప రోజు కానుంది. ఈరోజు మీరు చిన్ననాటి స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు మీరు అనుకున్న పని పూర్తవుతుంది. మీరు ఓ పని కోసం పెద్ద నిర్ణయం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. పిల్లలు తమ స్నేహితులతో ఆడుకోవడానికి సాయంత్రం పార్కుకు వెళతారు. ప్రేమికులు ఈరోజు రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి ప్లాన్ చేస్తారు.

Advertisement

మీనరాశి :
ఈరోజు మీరు కొన్ని కొత్త పనుల కోసం ప్లాన్ చేస్తారు. మీ ప్రణాళిక విజయవంతం అవుతుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. దీంతో బంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఒక నిర్దిష్ట సందర్భంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సలహా పొందుతారు. ఈరోజు మీ ఆర్థిక రంగం బలపడుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

Read Also : RRR Movie Ticket Rates : ఆర్ఆర్‌ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఎంతంటే?

Advertisement