...
Telugu NewsEntertainmentKajal agarwal baby boy: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

Kajal agarwal baby boy: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

టాలీవుడ్ అందాల భామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ అగర్వాల్ కుటుంబం ఈ శుబవార్తను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరించేశాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని తమ కథనాల్లో స్పష్టం చేశాయి.

Advertisement

Advertisement

దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య సినిమా షూటింగ్​లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు